Koratala : తిరిగి టాలీవుడ్ కే..

ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు చాలా గ్యాప్ వచ్చింది. చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి.. ఆచార్య ముందు వరకు టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్న కొరటాల శివతో. మరొకటి కేజీఎఫ్ లాంటి సంచలనాన్ని సృష్టించి సినీ ప్రపంచాన్ని తనవైపునకు తిప్పుకున్న ప్రశాంత్ నీల్ తో ఉంది. మంచి డైరెక్టర్ లతో సినిమాలు ఉన్నా.. తారక్ ప్రస్తుతం ఖాళీగా ఎందుకు ఉన్నాడు అనే ప్రశ్న ప్రతి ఒక్కరికీ వస్తుంది. దీనికి సమాధానాలు కూడా చాలానే ఉన్నాయి.

ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా లెవెల్ లో పెరిగింది. తన నుంచి తర్వాత వచ్చే సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండాలి. అందుకే ఈ గ్యాప్. NTR30 స్టోరీలో కొరటాల శివకు తారక్ మార్పులు చెప్పాడు.. అక్కడి నుంచి ఈ గ్యాప్ వస్తుంది. నాలుగు నెలలు కావస్తున్నా.. ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఇటీవల తారక్ కు కొరటాల ఫైనల్ నెరేషన్ ఇచ్చాడట. ఈ వార్త బయటకు వచ్చి కూడా వారం పైగా అవుతుంది. ఇప్పుడు కూడా కనీసం పూజా కార్యక్రమాలు అయినా పెట్టడం లేదు. హీరోయిన్ ను ఫిక్స్ చేసిన తర్వాతే సెట్స్ పైకి అనే ఆలోచనలో ఉన్నారట.

ఈ హీరోయిన్ వ్యవహారం కూడా పెద్దదే. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన నాటి నుంచి హీరోయిన్ కోసం కొరటాల సెర్చ్ చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీనే కావాలని పట్టు పట్టి కూర్చున్నాడు. ఇప్పటి వరకు కొరటాల దాదాపు 10 మంది బాలీవుడ్ హీరోయిన్ల పేర్లును పరిశీలించారు. ఆలియా భట్ నుంచి స్టార్ట్ అయినా ఈ లిస్ట్.. అనన్య పాండే, దిశా పటానీ వరకు వచ్చింది. అందులో ఒక్కరు కూడా ఫైనల్ కాలేదు. దీంతో ఏం చేయలేక టాలీవుడ్ బాట పట్టాడు కొరటల.

- Advertisement -

టాలీవుడ్ లో కూడా సమంత, రష్మికా మందన్నా పేర్లు కూడా వినిపించాయి. ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. మహానటితో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ను మూవీ టీం పరిశీలిస్తుందట. తారక్ కు జోడీగా కీర్తి సరిపోతుందని కొరటాల కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ హీరోయిన్ అయినా ఫిక్స్ చేస్తారా ? లేక హీరోయిన్ పాత్రపై ఇంకా క్యూరియాసిటీని పెంచుతాడా ? అని నెటిజన్లు అంటున్నారు. అసలు ఎన్టీఆర్ సినిమాకు హీరోయిన్లు దొరకడం లేదా? హీరోయిన్ పాత్రపై కొరటాల ఎందుకు క్యూరియాసిటీ పెంచుతున్నాడు? అంటూ అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వీటికి సమాధానం కూడా రావడం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు