తెలుగు బ‌య్య‌ర్లును నిండా ముంచేసిన రాకీ భాయ్..?

క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో పుట్టిన కేజీఎఫ్-2 ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డుల‌ను కొల్ల‌గొడుతుంది. ఏప్రిల్ 14న రిలీజ్ అయిన ఈ సినిమాను భాషాల‌తో సంబంధం లేకుండా.. ప్రేక్ష‌కులు ఆరాధిస్తున్నారు. హిందీ రాష్ట్రాల్లో కూడా ఒక్క సౌత్ మూవీ ఈ రేంజ్ ఆడ‌టం చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ 13 రోజుల్లో రూ. 466.25 కోట్ల షేర్, రూ. 942.75 కోట్ల గ్రాస్ ను ద‌క్కించుకుంది. దీంతో భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్య‌ధిక వ‌సూలు చేసిన లీస్ట్ లో నాలుగో స్థానంలోకి చేరింది. అతి త్వ‌ర‌లోనే రూ. 1,000 కోట్ల మార్క్ ను అందు కోవ‌డానికి ఎంతో టైం ప‌ట్ట‌దు.

వర‌ల్డ్ వైడ్ గా కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 జోష్ ఉన్నా.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ ఫామ్ క‌నిపించ‌డం లేదు. తెలుగు స్టేట్స్ లో రికార్డు స్థాయిలో రూ. 78 కోట్ల బిజిసెస్ చేసుకుని.. రూ. 79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో తెలుగు బ‌య్య‌ర్లు బ‌రిలోకి దిగారు. కానీ అశించిన ఫ‌లితాలు రాలేక పోవ‌డంతో నిరాశ‌లో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కేజీఎఫ్ చాప్ట‌ర్ -2… 13వ రోజు కేవ‌లం 0.94 కోట్ల షేర్, రూ. 1.60 కోట్ల గ్రాస్ మాత్ర‌మే వ‌సూలు చేసింది. బ్రేక్ ఈవెన్ రాబ‌ట్టాలంటే.. ఇంకా 3.35 కోట్ల షేర్ ను రాబ‌ట్టాలి.

అయితే మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఆచార్య ఈ శుక్ర‌వారం రిలీజ్ అవుతున్నా.. విష‌యం తెలిసిందే. కాగ ఆచార్య ఎఫెక్ట్ కేజీఎఫ్-2 పై ప‌డితే.. బ్రేక్ ఈవెన్ కొట్ట‌డం క‌ష్ట‌మే అని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. పాన్ ఇండియాలో ర‌చ్చ చేస్తున్న కేజీఎఫ్ చాప్ట‌ర్ – 2 తెలుగు స్టేట్స్ లో క‌నీసం బ్రేక్ ఈవెన్ అందుకుంటుందా.. అని తెలియాలంటే మ‌రి కొద్ది రోజుల వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు