Kiccha Sudeep: పొలిటికల్ ఎంట్రీ..?

శాండల్ వుడ్ ( కన్నడ) స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు సుదీప్. ఆ తరువాత బాహుబలి లో ఓ చిన్న పాత్రలో నటించి మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. అయితే కిచ్చా సుదీప్ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ తో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ భేటీ అయ్యారు. ఇప్పుడు ఈ వార్త కన్నడ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. వీరి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇదే కర్ణాటక సినీ, రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.

దీంతో సుదీప్ పొలిటికల్ ఎంట్రీ పై ఊహాగానాలు జోరందుకున్నాయి. బెంగళూరులోని సుదీప్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు శివకుమార్. వీరి భేటీకి గల వివరాలు బయటకు రాలేదు. అయితే కేవలం మర్యాదపూర్వకంగానే సుదీప్ ను శివకుమార్ కలిశారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్ గా ఉండాలని సుదీప్ ను శివకుమార్ ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది.

- Advertisement -

గతంలో జెడిఎస్ తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. కొందరు ఎమ్మెల్యేలు బిజెపిలోకి ఫిరాయించడంతో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి 2019లో బిజెపి పార్టీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే సుదీప్ ని ఎలాగైనా పార్టీలోకి తీసుకురావాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు