Lawrence : రోలెక్స్ కు అసిస్టెంట్ గా..

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా – లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కి సెన్సేషనల్ విజయం సాధించిన చిత్రం ఖైదీ. తమిళంలో మాత్రమే కాక ఇతర భాషల్లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ సినిమాతో ఈ సినిమాకి లింక్ పెట్టాడు లోకేష్ కనగరాజ్. ఇప్పుడు ఖైదీ సినిమాకు సీక్వెల్ రూపొందనున్న విషయం తెలిసిందే.

అయితే విక్రమ్ సినిమా ఎక్కడైతే ముగిసిందో.. అక్కడి నుండే ఖైదీ సినిమాని ప్రారంభించబోతున్నారట. విక్రమ్ సినిమాలో ఢిల్లి పాత్రని తీసుకువచ్చిన లోకేష్ కనగరాజ్.. ఖైదీ సీక్వెల్ లో రోలెక్స్ టీం నుంచి ఒక వ్యక్తిని విలన్ గా చూపించబోతున్నారట. ఆ నెగిటివ్ రోల్ లో ప్రముఖ యువ దర్శకుడు, నటుడైన రాఘవ లారెన్స్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. విక్రమ్ మూవీ క్లైమాక్స్ లో రోలెక్స్ పాత్రలో సూర్య కనిపించిన విషయం తెలిసిందే.

అలా ఖైదీ 2 లో రోలెక్స్ బ్యాచ్ లోని ఒక కీలక వ్యక్తిగా లారెన్స్ నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నారని తమిళ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. కాగా లేటెస్ట్ కోలీవుడ్ బజ్ ప్రకారం వచ్చే ఏడాది ఈ మూవీ పట్టాలెక్కనున్నట్లు సమాచారం. అయితే విరుమన్, పొన్నియన్ సెల్వన్, సర్దార్ సినిమాల సక్సెస్ జోష్ లో ఉన్న కార్తీ.. ఖైదీ 2 సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు