Maadhavilatha : కాంగ్రెస్ పార్టీ విజయంపై హీరోయిన్ వివాదాస్పద పోస్ట్… దుమారం స్టార్ట్

కాంట్రవర్సీ బ్యూటీ మాధవీలత ఏం చేసినా వివాదమే అవుతుంది. ఇటీవల కాలంలో ఈ బ్యూటీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ ఎలక్షన్స్ లో సక్సెస్ సాధించిన కాంగ్రెస్ పార్టీపై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది ఈ అమ్మడు.

మాధవీలత గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. స్నేహితుడా, నచ్చావులే లాంటి హిట్ సినిమాల్లో నటించి హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఈ తెలుగు అమ్మాయి ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బిజెపి పార్టీలో ఒక నేతగా కొనసాగుతున్న ఈ బ్యూటీ సినిమా ఇండస్ట్రీపై కాన్సన్ట్రేషన్ ఏమాత్రం తగ్గించలేదు. అవకాశం దక్కినప్పుడల్లా ఇండస్ట్రీపై ఏదో ఒక సంచలన కామెంట్ చేస్తూనే ఉంది. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో మహిళలపై జరుగుతున్న వేధింపులు, అవకాశాల పేరుతో లోబరుచుకునే ప్రయత్నాలు చేస్తారు అంటూ సంచలన విషయాలు బయటపెట్టింది. ఇక ఆమెపై ఎంత ట్రోలింగ్ జరిగినా మాధవీలత మాత్రం వెనకడుగు వేయదు. ఏ విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తుంది. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పోస్ట్ చేస్తూ వివాదాలకు దారితీస్తుంది. ఇక ఆ పోస్టులలో సినిమాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా రాజకీయాలపై కూడా కామెంట్స్ ఉంటాయి.

తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు అధికారంలో ఉన్న కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎవ్వరూ ఊహించని విధంగా ఓటమిని చవిచూసింది. ఇక త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రేవంత్ రెడ్డి వర్గీయులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తెలంగాణలో జరిగిన ఈ అనూహ్య పరిణామాలు మాధవీలతకి అంతగా నచ్చలేదో ఏమో కానీ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీని ఏకిపారేసింది. కాంగ్రెస్ గెలుపుపై ఆమె తాజాగా చేసిన పోస్ట్ తీవ్ర దుమారం సృష్టించేలా కనబడుతోంది.

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ గెలుపుతో తెలంగాణలో రావణ రాజ్యం రాబోతోందని, తెలంగాణలో వచ్చే ఐదు ఏళ్లలో జరగబోయే దారుణాలు ఇవేనంటూ లిస్ట్ నెటిజన్ల ముందు ఉంచింది. “ఫుడ్ ఉండదు, ఉద్యోగాలు ఉండవు, మహిళలకు భద్రత ఉండదు, శాంతి అంతకన్నా ఉండదు. ఎంజాయ్ చేయండి. తెలంగాణ కాంగ్రెస్ లవర్స్ కి గుడ్ లక్.. కాంగ్రెస్ తో పోలిస్తే బీఆర్ఎస్ కి నేను 99 మార్కులు వేస్తాను” అంటూ మాధవీలత పోస్ట్ చేసింది. ఇక ఆమె పోస్ట్ చూసిన కాంగ్రెస్ మద్దతుదారులు మాధవీలతను దారుణంగా టోల్ చేస్తున్నారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పని, ఆ తీర్పుని గౌరవించాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఈమెకు లేదంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఏది ఏమైనా మాధవీలత చేసిన పోస్ట్ మాత్రం తీవ్ర వివాదానికి తెరలేపే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు