SSMB28: జగన్ ప్రభుత్వాన్ని తెగ వాడేస్తున్న మహేష్ ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన అతడు, ఖలేజా రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా వస్తుంది. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను కూడా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ లీల సెకండ్ హీరోయిన్ గా కనిపించబోతున్నది.

అయితే ఎస్ఎస్ఎంబి 28వ సినిమా కోసం జగన్ పథకం పేరును టైటిల్ గా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘ఆ’ సెంటిమెంట్ ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. తన సినిమాలకు ఎక్కువగా ఆ అనే అక్షరంతో మొదలయ్యే టైటిల్స్ ఉంటాయి. తీసిన 11 సినిమాల్లో ఆరు సినిమాలకు టైటిల్స్ ఆ తోనే మొదలయ్యాయి అంటే అర్థం చేసుకోవచ్చు త్రివిక్రమ్ కి సెంటిమెంట్ ఏ రేంజ్ లో ఉందో అనేది.

అతడు, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీర రాఘవ, అలా వైకుంఠపురంలో ఇలా ఆ అనే అక్షరంతో మొదలయ్యాయి తాజాగా మహేష్ తో తెరకెక్కిస్తున్న సినిమాకు ఆ అక్షరంతో మొదలయ్యే టైటిల్ ని పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వ పథకాల్లో బాగా ప్రాచుర్యం పొందిన అమ్మఒడి పేరును ఈ సినిమాకు పెట్టినట్లు సమాచారం. అమ్మ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి అమ్మఒడి అనే టైటిల్ అయితే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుందని ఈ పేరే ఖాయం చేసినట్లు తెలుస్తుంది.

- Advertisement -

కాగా SSMB28కి ముందుగా అమ్మవడి టైటిల్ ఖరారు అయినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. తర్వాత అది గాసిప్ మాత్రమే అంటూ న్యూస్ వచ్చింది. తాజాగా మరోసారి SSMB28 టైటిల్ అమ్మవడి అనే తెగ ప్రచారం సాగుతుంది. దీంతో మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ టైటిల్ అమ్మవడి అయి ఉంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు