Viswam : ఎంతమంది వస్తారు? మ్యాచో స్టార్ కూడా అదే రోజుపై కన్నేశాడు..

Viswam : టాలీవుడ్ లో మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న ప్రెస్టిజియస్ సినిమాల్లో “పుష్ప ది రూల్” ఒకటి. ఈ సినిమా కోసం ఒక్క టాలీవుడ్ నుండే కాకుండా పాన్ ఇండియా వైడ్ గా అన్ని ఇండస్ట్రీలలోనూ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ఏ రేంజ్ అంచనాలు నెలకొని ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప 2 సినిమాతో ఇతర ఇండస్ట్రీలలో బడా సినిమాలు కూడా పోటీ పడలేక వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హిందీలో సింగం అగైన్ సినిమా పుష్ప తో ఇబ్బంది పడలేకే వాయిదా వేసుకుందని అందరికి తెలుసు. నిజానికి సమ్మర్ లోనే రావాల్సిన పుష్పరాజ్ ఆగష్టు 15 కి వాయిదా వేయగా, ఆ డేట్ కి పక్కాగా రిలీజ్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా నిన్న పుష్ప ది రూల్ ని ఏకంగా డిసెంబర్ 6 కి వాయిదా వేస్తున్నామని అనౌన్స్ చేసి షాకిచ్చారు. ఇది నిజంగా అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల వారికి షాకిచ్చే న్యూస్ అనే చెప్పాలి. అయితే ఇదిలా ఉండగా పుష్ప రాజ్ తప్పుకున్న ఆ డేట్ ని ఇప్పుడు వరుసగా వేరే సినిమాలు కబ్జా చేస్తున్నాయి.

Makers plan to release Viswam movie on August 15

డబుల్ ఇస్మార్ట్ అఫిషియల్…

ఇక పుష్ప ది రూల్ వాయిదా పడుతుందని తెలియగానే పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కాంబోలో వస్తున్నడబుల్ ఇస్మార్ట్ ని ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించేసారు. పుష్ప 2 వాయిదా అనౌన్స్ మెంట్ కి ముందే డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ డేట్ ని ప్రకటించేసారంటే, పుష్ప 2 పక్కా వాయిదా పడుతుందని ఆ సినిమా మేకర్స్ కనుకున్నారని తెలుస్తుంది. ఇక పుష్ప 2 వాయిదా పడకపోతే డబుల్ ఇస్మార్ట్ దాదాపు దసరా టైం కి షిఫ్ట్ అయిపోయేవారు. ఇక పుష్ప 2 వాయిదా పడడం వల్ల, డబుల్ ఇస్మార్ట్ తో పాటు దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ కూడా అగస్ట్ పై కన్నేశాడని తెలుస్తుంది. ఈ సినిమాను కూడా ఆగష్టు 15న రిలీజ్ చేద్దామని నిర్మాత నాగవంశీ గట్టిగా ట్రై చేస్తున్నాడు.

- Advertisement -

మ్యాచో స్టార్ కూడా కన్నేశాడు…

ఇక ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ సినిమా రిలీజ్ డేట్ ని కంఫర్మ్ చేసుకోగా, ఇప్పుడు మరో సినిమా కూడా అదే డేట్ పై ఖర్చీఫ్ వేసిందని తెలుస్తుంది. ఆ సినిమా ఏదో కాదు. మ్యాచొ స్టార్ గోపీచంద్ మూవీ. ఇక గోపిచంద్ శ్రీనువైట్ల కాంబినేషన్ లో విశ్వం (Viswam) అనే సినిమా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ మంచి అంచనాలు క్రియేట్ చేయగా, విశ్వం సినిమాని కూడా ఆ చిత్ర యూనిట్ పుష్ప తప్పుకున్న ఆగష్టు 15 రిలీజ్ డేట్ నే టార్గెట్ చేసినట్టు వినిపిస్తుంది. అయితే విశ్వం సినిమా రిలీజ్ డేట్ ని ఇప్పటివరకూ ప్రకటించలేకపోగా, చిత్ర యూనిట్ నుండి ఆగష్టు 15నే రిలీజ్ ని టార్గెట్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే విశ్వం చిత్ర యూనిటే క్లారిటీ ఇవ్వాలి. మరి ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ ఆగష్టు 15పై ఫోకస్ చేయగా, లక్కీ భాస్కర్, అలాగే ఇప్పుడు విశ్వం సినిమాలు ఫోకస్ చేశాయని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు