Manchu Manoj: మంచు బ్రదర్స్ మధ్య ఆస్తుల రగడ.. నిజమెంత ?

మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ ఇటీవల దివంగత రాజకీయా నాయకుడు భూమ నాగిరెడ్డి వారసురాలు భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లి సమయంలో మంచు ఫ్యామిలీ గురించి అనేక రకాలుగా వార్తలు వచ్చాయి. మనోజ్, మౌనికల పెళ్లి మంచు ఫ్యామిలీ ఇష్టం లేదని, మోహన్ బాబు, విష్ణు పెళ్లికి వచ్చే అవకాశాలు కూడా తక్కువే అని టాలీవుడ్ వర్గాల్లో తెగ చర్చ జరిగింది.

అందుకే పెళ్లి మోహన్ బాబు నివాసంలో కాకుండా మంచు లక్ష్మీ నివాసంలో జరిగింది అంటూ కూడా పలువురు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరకున్నాయని కూడా టాక్ వచ్చింది. అందుకే మనోజ్ పెళ్లిలో విష్ణు అంటి ముట్టనట్టు ఉన్నాడని అంటున్నారు. నిజానికి మనోజ్ పెళ్లికి విష్ణు వచ్చినా, ఇతర కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనలేదు. అలాగే మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోల్లో విష్ణు ఎక్కడా కనిపించలేదు.

దీంతో మంచు బ్రదర్స్ మధ్య జరిగింది అంటూ వస్తున్న వార్తలు ఇంకాస్త బలంగా బయటకు వచ్చాయి. విష్ణుకు మనోజ్ రెండో పెళ్లి ఇష్టం లేదని, ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలు కూడా వచ్చాయని వినిపించింది. మనోజ్ పెళ్లికి రావడానికి విష్ణు ససేమిరా ఒప్పుకోలేదట. మధ్యలో మంచు లక్ష్మీ పలు రాయభారం చేయడం వల్ల పెళ్లి వరకు వచ్చారని టాక్. పెళ్లికి వచ్చినా, అన్నింటికి దూరంగానే ఉన్నాడని పలువురు అంటున్న మాట.

- Advertisement -

అయితే మనోజ్ పెళ్లి సమయంలో విష్ణు దూరంగా ఉండటానికి ఇతర కారణాలు ఉన్నాయని మంచు ఫ్యామిలీ సన్నిహితులు అంటున్నారు. మా అధ్యక్షుడిగా ఉన్న విష్ణు ఆ పనిలో ఉండటం వల్ల మనోజ్ పెళ్లి పనులుకు దూరంగా ఉన్నాడని చెబుతున్నారు. అంతే కానీ, మనోజ్, విష్ణు మధ్య ఎలాంటి తగాదాలు లేవని చెప్పుకొస్తున్నారు. అయినా, దీనిపై ఇప్పట్లో స్పష్టత రావడం కష్టమే అని తెలుస్తోంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు