Mrunal Thakur : తారక్ నే రిజెక్ట్ చేసిందా ?

మృణాల్ ఠాకూర్.. కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ లో ఈ పేరు ఎవరికీ తెలియదు. కానీ హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో యువత గుండెల్లో కొలువుదీరింది ఈ మృణాల్ ఠాకూర్. ముందుగా బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఎక్కువ క్రేజ్ ను అయితే సంపాదించుకోలేపోయింది. కానీ తెలుగులో మొదటి సారి చేసిన సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

సీతారామం తర్వాత మృణాల్ కు బాలీవుడ్ వరుసగా ఛాన్స్ లు వస్తున్నాయి. అయితే ఈ సీతా మహాలక్ష్మీకి తెలుగులోనూ మంచి అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ ఈ సినిమా తర్వాత మృణాల్ మరో తెలుగు సినిమాకు సైన్ చేయడానికి కాస్త టైం పట్టింది. ఈమె తెలుగులో చేస్తున్న రెండో సినిమా నుంచి ఇటీవల అధికారిక ప్రకటన వచ్చింది.

నాని కెరీర్ లో 30వ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఎంపికైంది. న్యూ ఇయర్ సందర్భంగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. అయితే నాని సినిమాకు ఓకే చెప్పే ముందు మృణాల్ కు మరో క్రేజీ ఆఫర్ వచ్చిందట. ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ కొట్టి సూపర్ ఫాంలో ఉన్న తారక్ తో అవకాశం వచ్చిందని సమాచారం. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న NTR30లో హీరోయిన్ గా చేయడానికి మృణాల్ ను టీం సంప్రదించారట.

- Advertisement -

అదే సమయంలో NANI30 టీం కూడా చర్చలు జరిపిందని తెలుస్తోంది. అయితే NTR30 లో హీరోయిన్ పాత్ర కంటే.. NANI30 చిత్రంలో హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఎక్కువ ఉందని, అందుకే నాని సినిమాను ఫైనల్ చేసిందని టాక్. అయితే మృణాల్ రెండు సినిమాలకు సైన్ చేస్తే బాగుండు అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

కానీ మృణాల్ చేతిలో ప్రస్తుతం నాని సినిమాతో కలుపుకుని మొత్తం ఐదు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. దీంతో డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో తారక్ ను రిజెక్ట్ చేయకతప్పలేదని తెలుస్తోంది. తారక్ ను రిజెక్ట్ చేసి నానికి ఓకే చెప్పేంతలా NANI30 ఏం ఉందని ప్రస్తుతం చర్చ జరుగుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు