Naga Chaitanya : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో సినిమా

అక్కినేని నాగచైతన్య, మంచి క్రేజ్ ఉన్న హీరో. జోష్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా అడుగుపెట్టిన అక్కినేని నాగచైతన్య, వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతతో పెళ్లి పీటలు ఎక్కిన నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల తర్వాత లవ్ స్టోరీ, బంగార్రాజు, థాంక్యూ వంటి సినిమాలతో బిజీ అయిపోయాడు చైతు. తాజాగా ‘లాల్ సింగ్ చద్దా’ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.

ఇది ఇలా ఉంటే చైతు కి సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్ బయటకు వచ్చింది. ‘లాల్ సింగ్ చద్దా’ మూవీని ప్రమోట్ చేస్తూనే మరోవైపు బాలీవుడ్ మార్కెట్ పై చైతు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని, నిర్మాత కరణ్ జోహార్ ని కలిసినట్లు సమాచారం. చైతన్య బుధవారం ముంబైలోని సంజయ్ లీలా భన్సాలీ ఆఫీసుకి వెళ్ళినట్లు టాక్. ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ ప్రమోషన్ అనంతరం నేరుగా సంజయ్ కార్యాలయానికి వెళ్లి సమావేశమయ్యాడట.

దీంతో వీరిద్దరి కాంబినేషన్లో మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయి అని అంతా చర్చించుకుంటున్నారు. ఇక ఏదేమైనా చైతన్య, సంజయ్ లీలా భన్సాలీ ని కలవడం టాలీవుడ్ లో ఆసక్తిని సంతరించుకుంది. దీంతో చైతో బన్సాలీ దేవదాసు మూవీ చేయాలి అంటూ అక్కినేని ఫ్యాన్స్ కోరుతున్నారు. అయితే సంజయ్ లీలా భన్సాలీ ని చైతన్య కలవడం వెనుక అసలు కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు