Remuneration : తొలి సినిమాకే..

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రికి పరిచయమయ్యాడు నాగ చైతన్య. తొలి చిత్రం జోష్ తోనే వినూత్న కథను ఎంచుకున్నాడు. తర్వాత విజయాలు, ఓటములు వచ్చినా ఎదుర్కొంటూ సినిమాలు చేశాడు. హీరోయిన్ సమంత ను 2017లో వివాహం చేసుకున్నాడు. నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నాడు. డైవర్స్ తర్వాత ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది బాలీవుడ్ కు కూడా చై ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించిన లాల్ సింగ్ చడ్డా అనే సినిమాతో బాలీవుడ్ కు నాగ చైతన్య పరిచయం అవుతున్నారు.

ఈ చిత్రం ఈ రోజు పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. దీని కోసం అమీర్ ఖాన్, కరీనా కపూర్, నాగ చైతన్య భారీ స్థాయిలో ప్రమోషన్లు చేశారు. బైకాట్ లాల్ సింగ్ చడ్డా, బైకాట్ బాలీవుడ్ అనే వివాదాల మధ్య ఈ రోజు చిత్రం రేపు విడుదలైంది. అయితే ఈ చిత్రంలో నాగ చైతన్య బాలరాజు అనే పాత్రలో నటించారు. ఈ పాత్రకు ముందుగా విజయ్ సేతుపతిని అనుకున్నారట. కానీ చివరికి యువ సామ్రాట్ నాగ చైతన్యకే దక్కింది.

ఇప్పుడు లాల్ సింగ్ చడ్డాలో బాలరాజు పాత్రకు నాగ చైతన్య తీసుకున్న పారితోషికంపై చర్చ నడుస్తుంది. తొలి బాలీవుడ్ సినిమాకే భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి చైతన్య 5 కోట్ల పారితోషికం తీసుకన్నట్లు సమాచారం అందుతుంది. నాగ చైతన్య సాధారణంగా ఒక్కొ తెలుగు చిత్రానికి 8 కోట్ల పారితోషికం తీసుకుంటాడు. అయితే తొలి బాలీవుడ్ సినిమాకు, అది కూడా అతిథి పాత్రకు భారీగానే తీసుకున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు