NBK108: బాలకృష్ణ సినిమాలో కాజల్ పాత్ర లీక్..

కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో టాలీవుడ్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తుంది. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK108లో ఈ స్టార్ హీరోయిన్ నటిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై చాలా రోజుల నుంచి రూమర్స్ రాగా, ఇటీవలే మూవీ యూనిట్ కాజల్ ను కన్ఫామ్ చేస్తూ అధికారిక ప్రకటన చేసింది. అయితే ఈ సినిమాలో కాజల్ ఎలాంటి పాత్ర చేస్తుంది అనేదానిపై అభిమానుల్లో ఆసక్తి ఉందన్న మాట నిజం. ఈ నేపథ్యంలో NBK108 మూవీలో కాజల్ పాత్ర లీక్ అయినట్టు తెలుస్తోంది.

ఈ మూవీలో కాజల్ పాత్ర ఇదేనంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీని ప్రకారం.. NBK108లో బాలకృష్ణ భార్య పాత్రలో కాజల్ కనిపించబోతుందట. ఫస్టాఫ్ లో బాలయ్య, శ్రీలీల చుట్టూ కథ తిరుగుతుందని సమాచారం. కాగా ఈ సినిమాలో బాలయ్య కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తుంది.

ఇక సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో కాజల్ కనిపిస్తోందని టాక్. అంతే కాకుండా, ఈ పాత్రకు విషాదకరమైన ముగింపు కూడా ఉంటుందని తెలుస్తోంది. కాజల్ ఉన్నంత వరకు ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉంటయట. ఈ పాత్ర కాజల్ కెరీర్ లో నిలిచిపోయేలా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

- Advertisement -

దీంతో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఓ రేంజ్ లో ఉండబోతుందని అభిమానులు అనుకుంటున్నారు. కాగా, సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ కోలీవుడ్ లో ఘోస్టీ అనే సినిమా చేసింది. ఇది ఇటీవలే రిలీజ్ అయింది. కానీ మూవీ కాజల్ అభిమానులను నిరాశపరిచింది. దీంతో అభిమానుల ఆశలన్నీ కూడా NBK108పైనే ఉన్నాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు