Agni Nakshatram: నీ “దొంగాట” ఇక సాగదు అంటున్న నెటిజన్స్

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నట వారసురాలిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచు లక్ష్మి గురించి మనకి తెలియంది కాదు. సినిమాలపై ఇంట్రెస్ట్ తో మొదట ప్రొడ్యూసర్ గా మారిన ఈమె, తమ్ముడు మంచు మనోజ్ హీరోగా శ్రీ, ఝమ్మంది నాదం, లాంటి సినిమాలని నిర్మించింది. అయితే ఆ సినిమాలు అంతగా ఆడలేదు. ప్రొడ్యూసర్ గా ఫెయిల్ అవ్వడంతో తన ఇంట్రెస్ట్ యాక్టింగ్ వైపునకు మళ్లింది. అయితే చూడ్డానికి యావరేజ్ గా ఉండే మంచులక్ష్మీ హీరోయిన్ గా ఎలాగూ సక్సెస్ అవదని తెలుసు. అందుకే తన తండ్రిని ఆదర్శంగా తీసుకొని విలన్ గానే ఎంట్రీ ఇచ్చింది.

అయితే అక్కడ కూడా తను ఫెయిల్ అయింది. పైగా నటిగా ప్రశంసలకన్నా ఎక్కువ విమర్శలే ఎదుర్కొంది. అయినా తన ప్రయత్నంగా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. ఇక తాజాగా ఒక ఫోటోషూట్ తో మరోసారి నెట్టింట వైరల్ అయ్యింది మంచు లక్ష్మి. ఆ ఫోటోషూట్ లో మంచు లక్ష్మి హీరోయిన్ లా ఎక్స్ పోజ్ చేస్తూ కనిపించింది. ఈ ఫోటోలను గమనించిన నెటిజన్స్ మంచు లక్ష్మి ని తెగ ట్రోల్ల్స్ చేస్తున్నారు. నటిగా, ప్రొడ్యూసర్ గా ఫెయిల్ అయిన నువ్వు ఇప్పుడు ఐటెం గర్ల్స్ గా కూడా చేస్తావా ఏంటి? అని తెగ ట్రోలింగ్ చేస్తున్నారు. ఫోటోషూట్ ల ద్వారా ఆకట్టుకుందామని చూస్తున్న మంచు లక్ష్మిని సినిమాల్లో చేసిన దొంగాట లాగా కాదు ఇప్పుడు నీ దొంగాటలు సాగవు అంటూ ఫన్నీ మీమ్స్ చేస్తున్నారు.

అంతే కాదు పెళ్ళై పదేళ్ల పాప ఉన్నా కూడా ఈ వయసులో ఇలా అసభ్యంగా ఫోటోషూట్ లను చేస్తారేంటి అని విమర్శిస్తున్నారు. ఇది గమనించిన మంచు లక్ష్మి కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో డిలీట్ చేసింది. అయినా ఒక్కసారి ఇంటర్నెట్ లోకి ఫొటోస్ వచ్చాయంటే అవి వాళ్ళ చేతిలో ఉండవ్. అందువల్ల ఇకనైనా మంచు లక్ష్మి ఇలాంటి ఫోటోషూట్ లకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ ఉమెన్ గా పేరు తెచ్చుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు