Pathaan: షారుఖ్,దీపికా ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ

వివాదాల నడుమ జనవరి 25న ప్రేక్షకుల ముందుకి వచ్చిన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ లేటెస్ట్ మూవీ పఠాన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. తొలిరోజే 100 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసి కం బ్యాక్ అంటే ఇది అంటూ షారుక్ నిరూపించాడు. ఇక మూడు రోజుల్లో 300 కోట్లు కలెక్ట్ చేసిన ఈ చిత్రం తాజాగా 500 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది.

అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరికెక్కిన ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. షారుక్ కు జోడిగా దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలోని ఓ పాటలో దీపిక అందాల ప్రదర్శన కూడా ఆకట్టుకుంది. జాన్ అబ్రహం విలన్ గా నటించిన ఈ సినిమాను యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.

అయితే పఠాన్ సినిమా విడుదలకి ముందు ఎటువంటి ప్రమోషన్స్ చేయలేదు. కానీ సినిమా విడుదల అయ్యి ఇంతటి భారీ విజయాన్ని సాధించడంతో సోమవారం సాయంత్రం ముంబైలో పఠాన్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో షారుక్, దీపిక, జాన్ అబ్రహం, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ పాల్గొన్నారు. మీడియాతో ముచ్చటించి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో దీపిక, షారుక్ కెమిస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఈ వేదికపై షారుక్ కు ప్రేమగా ఒక ముద్దు కూడా ఇచ్చింది దీపిక. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆఫ్ స్క్రీన్ లో ఈ రేంజ్ కెమిస్ట్రీ ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు