Pawan Kalyan : హరీష్ సినిమాకు మోక్షం

పవర్ స్టార్ వపన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని టాలీవుడ్ లో చాలా మంది డైరెక్టర్లు అనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల కంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. దీంతో ఆయన సినిమాలు పెద్దగా చేయడం లేదు. అందువల్లే ఎప్పుడో పూర్తి కావాల్సిన హరి హర వీరమల్లు సినిమా ఇంకా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన హరీష్ శంకర్ మూవీ, వినోదయ సీతం సినిమాలు ఇంకా అక్కడే ఉన్నాయి.

దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త అసంతృప్తితో ఉన్నారు. తమ అభిమాన హీరోను ఎక్కువగా సిల్వర్ స్క్రీన్ పై చూడాలని అనుకుంటున్నారు. అలాంటి వారికి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక న్యూస్ ఊరటనిస్తుంది. హరి హర వీరమల్లు తర్వాత పవన్ మరి కొంత సమయాన్ని సినిమాలకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నాడట. అందుకోసం కొన్ని రోజులు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్టు టాక్ వినిపిస్తుంది.

అయితే కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కు సాహో దర్శకుడు సుజిత్ ఒక స్టోరీ చెప్పాడని వార్తలు వచ్చాయి. కథ నచ్చడంతో సుజిత్ ను పవర్ స్టార్ భోజనానికి కూడా ఆహ్వానించాడట. సుజిత్ చెప్పిన స్టోరీ చాలా నచ్చడంతో, హరి హర వీరమల్లు తర్వాత ఆయనతోనే సినిమా చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

అయితే పవన్ కళ్యాణ్ కోసం హరిష్ శంకర్, సముధ్ర ఖని ఎదురుచూస్తున్నారు. ఇటీవల శంకర్-పవన్ సినిమా ఉంటుందని, ఆ షూటింగ్ స్పాట్ కు తాను త్వరలోనే వస్తా అని హరి హర వీరమల్లు దర్శకుడు క్రిష్ జగర్లమూడి చెప్పాడు. దీంతో పవన్ తర్వాత సినిమా హరీష్ శంకర్ తోనే అని కూడా టాక్ వస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు