Salman Khan : పవన్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో..?

బాలీవుడ్ హీరోలు ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ పై కూడా కన్నేశారు. తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమాను అయినా ఆదరిస్తారు అనే విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోల సినిమాలను కూడా మన తెలుగు వాళ్ళు 4 దశాబ్దాలుగా ఆదరిస్తూనే ఉన్నారు. డబ్బింగ్ ఇవ్వకపోయినా థియేటర్లకు వెళ్లి మరీ చూస్తుంటారు. అయితే తెలుగులో నటించడానికి బాలీవుడ్ హీరోలు ఇంట్రెస్ట్ చూపేవారు కాదు. ఇప్పుడు తెలుగు సినిమా రేంజ్ పెరిగింది కాబట్టి, తెలుగు సినిమాల్లో నటించడానికి బాలీవుడ్ స్టార్ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఈ లిస్ట్ లో సల్మాన్ ఖాన్ ముందున్నాడు. ఇప్పటికే చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ లో ఇతను ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. మోహన్ రాజా ఆ చిత్రానికి దర్శకుడు. దీంతోపాటు విక్టరీ వెంకటేష్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నట్టు చిత్ర సీమ వార్తలు వస్తున్నాయి. తాజా గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారట. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నటించడానికి సల్మాన్ ఖాన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు