Godfather : పవన్ కళ్యాణ్!

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ” గాడ్ ఫాదర్”. దసరా రోజున ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య ఈ చిత్రం రిలీజ్ కానుంది. తమిళ దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన ఈ సినిమాలో చిరు తిరిగి బౌన్స్ బ్యాక్ అవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాను మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కించడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నటిస్తున్నాడని తెలియడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో గెస్ట్ రోల్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దింపారని తెలుస్తోంది.

‘లూసిఫర్’ టోవినో థామస్ చేసిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి హైలెట్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్పీచ్ గా నిలుస్తుందట. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్ర దాదాపు 20 నిమిషాల నిడిది ఉంటుందని.. కేవలం మూడు షాట్ లలో పవన్ కళ్యాణ్ కనిపించేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు.. దీనిపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు