NTR30 : దసరాకి వచ్చేనా ?

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సూప‌ర్ హిట్ సాధించింది. దీంతో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మంచి జోష్‌లో ఉన్నాడు. ఈ సినిమాతో దేశ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్నారు. త‌న త‌రువాత సినిమా కొర‌టాల‌-ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ 30 సినిమాపై అభిమానులు భారీగానే అంచ‌నాల‌ను పెంచుకున్నారు. ఎన్టీఆర్ 30 నుంచి ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్ గ్లింప్స్ అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి.

ఇప్ప‌టివ‌ర‌కు కొరటాల ఎన్టీఆర్ కాంబోలో తెర‌పైకి వ‌చ్చే సినిమాకి సంబంధించి ర‌క‌ర‌కాల‌ రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ 30 హీరోయిన్ విష‌యంపై రోజుకో కొత్త‌ పేరు వినిపించ‌డం విశేషం. ఈ సినిమాను త్వ‌ర‌లోనే షూట్ ప్రారంభం అవుతుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే లెంగ్తీ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు కొర‌టాల‌. ఇక కథలో అయితే కొంత మైథిలాజికల్ టచ్ కూడా ఉండ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌లే కొర‌టాల శివ‌, డీఓపీ ర‌త్న‌వేలు, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ సాబు సిరిల్ భారీ స్థాయిలో ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను వేగవంతం చేసిన‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

అయితే ఈ సినిమా షూటింగ్‌ని అతి త్వ‌ర‌లో ప్రారంభించి 2023 ద‌స‌రా పండుగ నాటికి విడుద‌ల చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. గ‌తంలో ఎన్టీఆర్-కొర‌టాల శివ కాంబోలో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ సినిమా కూడా ద‌స‌రా పండుగ‌కి నెల రోజుల ముందుగా విడుద‌ల‌వ్వ‌డం విశేషం. జ‌న‌తా గ్యారేజ్ సినిమా మాదిరిగానే ‘ఎన్టీఆర్ 30’ విజ‌యం సాధిస్తుందో లేదో వేచి చూడాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు