Prabhas: ప్రాజెక్ట్ కె కు బిగ్ ‘బి’ ప్రాబ్లం..

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె అనే భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీన్నీ వైజయంతి బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ లో వచ్చే 50వ సినిమా కాబట్టి.. ఎక్కడ కూడా తగ్గకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ – దీపికా పదుకొనె హీరో, హీరోయిన్లు గా నటిస్తుండగా, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

అయితే ఇటీవల ప్రాజెక్ట్ కె షూటింగ్ లో అమితాబ్ బచ్చన్ గాయపడ్డ విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బిగ్ బి పక్క టెముకలకు తీవ్రమైన గాయం అయ్యిందట. దీంతో హైదరాబాద్ లోని ఓ ప్రయివెట్ హాస్పటల్ కి అమితామ్ ను తరలించారు. అక్కడ చికిత్స అందుకున్న బిగ్ బి, వెంటనే ముంబైకి షిఫ్ట్ అయ్యారు.

బిగ్ బి ఇప్పట్లో షూటింగ్ సెట్స్ కి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయట. కనీసం మూడు నెలల పాటు ఆయన విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. దీని ప్రభావం ప్రాజెక్ట్ కె విడుదల తేదీపై పడనుంది. ప్రాజెక్ట్ కెను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. అందుకు అనుగూణంగా వేగంగా షూట్ ను పూర్తి చేస్తున్నారు. అయితే బిగ్ బిపై ఇంకా 10 శాతం మేర షూటింగ్ చేయాల్సి ఉందట. దీంతో ఈ షూట్ పూర్తి చేయడానికి చాలా టైం పట్టేలా ఉందని తెలుస్తోంది.

- Advertisement -

బిగ్ బి పూర్తిగా కోలుకుని ప్రాజెక్ట్ కె సెట్స్ పైకి రావడానికి 3 నెలలకు పైగే పడుతుందని టాక్. దీని తర్వాత అమితాబ్ షూట్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకోవడానికి సంక్రాంతికి విడుదల చేయడం జరిగే పని కాదని టాలీవుడ్ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. పైగా ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ పనులు ఎక్కువగా ఉండనున్నాయి.

ఈ పనులను పూర్తి చేయడం అంత సులువు కాదు.. అంతర్జాతీయ స్థాయిలో వీఎఫ్ఎక్స్ వర్క్స్ జరిగాలి. ఇవన్నీ సంక్రాంతి లోపు జరిగేలా లేవు. దీంతో ప్రాజెక్ట్ కె ను సంక్రాంతికి విడుదల అవ్వడం కష్టమే అని చెప్పొచ్చు. ఇది రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న RC15 కి కలిసొచ్చే అంశం. ఎందుకంటే.. ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉండబోతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు