Rajinikanth : గెస్ట్ పాత్ర‌లో

తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో 169 వ చిత్రం “జైలర్” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రజనీకాంత్ ను స్టైలిష్ గా చూపించడంతోపాటు “జైలర్” గా డిఫరెంట్ అవతారంలో ప్రజెంట్ చేయాలని నెల్సన్ భావిస్తున్నారట. ఇక ఈ చిత్రానికి యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రంలో రజనీకాంత్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా నటిస్తోంది. అయితే తమన్నా కంటే ముందే ఈ పాత్ర కోసం ప్రియాంక మోహన్ ని తీసుకున్నారట. కానీ నెల్సన్ తో జరిగిన ఓ చిన్న వివాదం వల్ల ప్రియాంక ఈ రోల్ కు నో చెప్పిందట. దీంతో తమన్నాను తీసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా రజినీకాంత్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హీరో అధర్వ సినిమాలో రజనీకాంత్ ఓ చిన్న పాత్రలో కనిపించనున్నట్లుగా సినీ వర్గాలలో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో రజినీకాంత్ చిన్న క్యామియో రోల్ లో కనిపించనున్నారట. ఈ సినిమాని రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ లో అధర్వతో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అధికారికంగా ప్ర‌క‌ట‌న‌ రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు