Rakul Preet Singh : రకుల్‌కు తండ్రిగా స్టార్ హీరో… ఇంకెన్ని దారుణాలు చూడాలో…

Rakul Preet Singh : సౌత్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే తన ప్రియుడు, నిరమహత జాకీ భగ్నానిని పెళ్ళాడిన విషయం తెలిసిందే. పెళ్లయ్యాక కొన్ని రోజులు పూర్తిగా పర్సనల్ లైఫ్ కే కేటాయించి చిల్ అయిన ఈ బ్యూటీ మళ్లీ వెండితెరపై మెరవడానికి సిద్ధమవుతోంది. అయితే ఆమె నెక్స్ట్ మూవీ గురించి ఓ ఆసక్తికరమైన వార్త తాజాగా బయటకొచ్చింది. ఓ స్టార్ హీరో రకుల్ కు తండ్రిగా నటించబోతున్నడని తెలుస్తోంది. మరి ఆ స్టార్ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లాక్ బస్టర్ సీక్వెల్ కు రకుల్ రెడీ

2019లో విడుదలైన అజయ్ దేవగన్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘దే దే ప్యార్ దే’ ప్రేక్షకులకు బాగా నచ్చింది. రూ.50 కోట్లతో రూపొందిన ఈ సినిమా రూ.143 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పుడు రెండో భాగం ‘దే దే ప్యార్ దే 2’ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. స్టార్ హీరో ఆర్ మాధవన్ ‘దే దే ప్యార్ దే’ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యాడు. దీంతో ఆయన పాత్రకు సంబంధించిన సస్పెన్స్ కూడా వీడింది.

R Madhavan and Ajay Devgn's reunion in De De Pyaar De 2 to have a twist -  Hindustan Times

- Advertisement -

రకుల్ కు తండ్రిగానా?

మీడియా కథనాల ప్రకారం మాధవన్ ‘దే దే ప్యార్ దే 2’ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో నటి రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి పాత్రలో ఆయన నటించనున్నారని అంటోంది బాలీవుడ్ మీడియా. ఈ ఏడాది సైతాన్ అనే హారర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మాధవన్. దీంతో ఆయన హిందీలో నెక్స్ట్ ఎలాంటి సినిమాలో నటిస్తాడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న అభిమానులకు తాజా వార్త షాక్ ఇస్తోందని చెప్పవచ్చు. రకుల్ కు తండ్రిగా మాధవన్ అనే వార్తలు చూసి ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో అంటూ తెగ బాధపడిపోతున్నారు మాధవన్ ఫ్యాన్స్. నిజానికి మాధవన్ వయసు ఉన్న హీరోలంతా తనకంటే సగం ఉన్న హీరోలతో రొమాన్స్ చేస్తుంటే, మాధవన్ మాత్రం తన ఏజ్ కు తగ్గ పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. కానీ మరీ ఇలా తండ్రి పాత్రలు చేస్తే ఎలా అంటున్నారు.

ఆ సీనియర్ హీరో రిజెక్ట్ చేసిన పాత్రలో..

మాధవన్ కంటే ముందు ఈ పాత్రకు అనిల్ కపూర్‌ ను అనుకున్నారట మేకర్స్. అయితే ఆయన తన బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ఆఫర్‌ను తిరస్కరించాడని తెలుస్తోంది. తర్వాత తండ్రి పాత్ర కోసం నిర్మాతలు మాధవన్‌ను సంప్రదించగా, అతను వెంటనే ఓకే చెప్పాడట. మాధవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఆయన పాత్ర వైవిధ్యంగా ఉండే అవకాశం ఉంది.

‘దే దే ప్యార్ దే’లో అజయ్ దేవగన్, టబు, రకుల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఓ పెళ్ళయిన వ్యక్తి తన ఏజ్ లో సగం వయసున్న అమ్మాయితో ప్రేమలో పడితే ఏం జరుగుతుంది? అనేదే ఈ మూవీ స్టోరి. ‘దే దే ప్యార్ దే 2’ 2025 మే 1న థియేటర్లలోకి రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు