Ram Gopal Varma : చర్యలు ఊహతీతం వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఫ్లాప్ సినిమాలు చేస్తూ తన గుర్తింపును తగ్గించుకుంటున్నాడు. ఒకప్పుడు పది మందికి ఆదర్శంగా నిలిచే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పది మందితో విమర్శలను అందుకుంటున్నాడు.  ఇటీవలే రామ్ గోపాల్ వర్మ ఏపీ సీఎం జగన్ ని కలిసిన తరువాత అతను తీయబోయే సినిమాల గురించి రకరకాల వార్తలు వినిపించాయి. అంతలోనే వర్మ స్పందిస్తూ.. వ్యూహం, శపథం అనే సినిమాలను తీయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉండగా.. వర్మ గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ భారీ పాన్ ఇండియా మూవీలో రామ్ గోపాల్ వర్మ నటిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ నటించే ప్రాజెక్ట్ కె లో ఓ చిన్న పాత్ర కోసం చిత్ర నిర్మాతలు ఇటీవలే వర్మను సంప్రదించినట్టు సమాచారం.మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె తెరకెక్కుతోంది. అయితే త్వరలోనే రామ్ గోపాల్ వర్మ తనకి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. తన నిజ జీవిత పాత్రలోనే రామ్ గోపాల్ వర్మ నటించనున్నట్టు సమాచారం. 

ఇది కనుక వాస్తవం అయితే మాత్రం ప్రభాస్ ప్రాజెక్ట్ కెె నిర్మాతలు ఎవ్వరూ ఊహించని విధంగా స్కెచ్ వేసినట్టే అనిపిస్తోంది. ప్రభాస్ సినిమాలో వర్మ క్యారెక్టర్ పెట్టి పాన్ వరల్డ్ సినిమా గురించి అందరూ చర్చించుకునేలా చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నారా ? లేక కథ ప్రకారమే అలాంటి రోల్ ఒకటి ఉందా అనే డిస్కషన్ అయితే నడుస్తోంది. ఈ విషయంపై  రామ్ గోపాల్ వర్మ లేదా ప్రాజెక్ట్ కె నిర్మాతలు అధికారికంగా క్లారిటీ ఇచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు