Ajay: రేప్ చేయబోయిన అజయ్ – తిరగబడ్డ నటి..!

విక్రమార్కుడు సినిమాలో చేసిన టిట్లా క్యారెక్టర్ ద్వారా గుర్తింపు పొందిన నటుడు అజయ్. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న రోల్స్ చేసి, ఆ తర్వాత విలన్ గా స్థిర పడి మొన్నామధ్య ఒకటి, అర సినిమాల్లో హీరోగా కూడా చేసాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అజయ్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన ఆసక్తికర సంఘటన గురించి చెప్పాడు. శ్రీహరి హీరోగా విజయన్ డైరెక్షన్లో వచ్చిన ‘శ్రీ మహాలక్ష్మి’  సినిమాలో నార్త్ కి చెందిన మోడల్ తో కలిసి రేప్ సీన్ చేయాల్సిన వచ్చిందని, షాట్ మొదలవగానే సీన్లో ఇన్వాల్వ్ అయిన అజయ్ ని సదరు నటి ‘డోంట్ టచ్’ అంటూ పక్కకి నెట్టిందని చెప్పాడు. ఆమె అలా గట్టిగా అరిచే సరికి ఒక్కసారిగా భయపడ్డానని అన్నారు. రేప్ సీన్ ఉన్న విషయం డైరెక్టర్ ఆ అమ్మాయికి ముందుగా చెప్పలేదా అన్న అనుమానం వచ్చిందని అన్నారు.

చివరికి ఆమె రేప్ సీన్ కి కో – ఆపరేట్ చేయకపోవటం వల్ల సీన్లో మార్పులు చేసి షూట్ చేసారని, ఇక అప్పటి నుండి రేప్ సీన్లలో నటించే ఆలోచన మానుకున్నా అని చెప్పుకొచ్చాడు. నిజానికి చాలా సినిమాల్లో రేప్ సీన్లు మాములే కానీ, ఇలాంటి ఇన్సిడెంట్స్ మాత్రం అరుదునే చెప్పాలి. ప్రస్తుతం అజయ్ చక్రవ్యూహం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో అజయ్ దిక్కులు చూడకు రామయ్య వంటి సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ ఆశించిన బ్రేక్ అయితే రాలేదు, ఇప్పుడు ఈ సినిమా ద్వారా మరోసారి హీరోగా మరో ప్రయత్నం చేస్తున్నాడు అజయ్.

అజయ్ సరసన జ్ఞానేశ్వరి కండ్రేగుల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్దగా ప్రమోషన్స్ ఏమీ లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమాలో అజయ్ పోలీస్ క్యారెక్టర్లో నటించాడు. ఒక పక్క నెగిటివ్ రోల్స్ చేస్తూనే అడపా దడపా హీరోగా ప్రయత్నిస్తున్న అజయ్ కి ఈ సినిమా అయినా ఆశించిన బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు