Raviteja : గెస్ట్ కాదు.. ఫుల్ లెన్త్

గాడ్ ఫాదర్ హిట్ తో మెగాస్టార్ చిరంజీవి తిరిగి ఫాం లోకి వచ్చాడు. దీనికి ముందు వచ్చిన ఆచార్య సినిమా చిరు కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచి, మెగా ఫ్యాన్స్ ను దారుణంగా నిరాశపరిచింది. ఆచార్య లాంటి అనుభవం మరోసారి రావద్దు అని మెగాస్టార్ తర్వాత సినిమాలను చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అలాగే సినిమా హిట్ అవ్వడానికి మరో పేరున్న నటుడ్ని కూడా తీసుకుంటున్నాడు. ఇటీవల వచ్చిన గాడ్ ఫాదర్ లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా వస్తున్న MEGA154 లో కూడా మరో స్టార్ నటుడు ఉన్నాడు. టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రవితేజ, చిరంజీవి కలిసి షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. అయితే ముందుగా మెగా 154లో రవితేజ పాత్ర ఒక గెస్ట్ లాగా ఉంటుందని టాక్ వినిపించింది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రవితేజ రోల్ గెస్ట్ లా కాకుండా.. ఫుల్ లెన్త్ గా ఉంటుందట. సినిమా మొత్తంగా చూస్తే రవితేజ పాత్ర 40 నుంచి 45 నిమిషాల వరకు ఉంటుందని టాక్. ఫస్ట్ ఆఫ్, సెకండ్ ఆఫ్ లో కూడా రవితేజ కనిపిస్తాడని టాక్.

గతంలో ఆచార్య సినిమా సమయంలో కూడా రామ్ చరణ్ పాత్ర ముందుగా గెస్ట్ రోల్ అని చెప్పారు. సినిమాలో చూస్తే చరణ్ పాత్ర 30 నిమిషాలకు పైగానే ఉంది. ఇప్పుడు మెగా 154లో కూడా రవితేజ పాత్రకు సంబంధించి అలాంటి వార్తలే వినిపిస్తున్నాయి. ఇది విన్న మెగా ఫ్యాన్స్ వార్తలు ఎలా ఉన్నా.. సినిమా ఫలితం మాత్రం ఆచార్య లా రాకుండా చూడండి అంటూ కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -

అయితే మెగా 154 సినిమాలో చిరు పాత్ర చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తుంది. చిరు కామెడీ టైమింగ్, డ్యాన్స్ అదిరిపోయేలా ఉంటాయని ఇన్ సైడ్ టాక్. అలాగే సినిమా కూడా ప్రేక్షకులను తప్పకుండా మెప్పించేలా ఉంటుందని సమాచారం. కాగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. టైటిల్ ను దీవాళి సందర్భంగా అనౌన్స్ చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు