Peddakapu: మంచితనం పక్కనెట్టిన రేలంగి మామయ్య – వర్కౌట్ అవుతుందా..?

శ్రీకాంత్ అడ్డాల పేరు వినగానే కుటుంబ కథా చిత్రాలు, మంచి తనం నిండిన పాత్రలు గుర్తుకొస్తాయి. అలాంటి శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం సినిమా డిజాస్టర్ అవ్వటంతో చాలా గ్యాప్ తీసుకొని ఆ మధ్య తమిళ సినిమా అసురన్ కి రీమేక్ గా రూపొందిన నారప్ప సినిమా ద్వారా తనలోని మాస్ యాంగిల్ ని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ప్రస్తుతం మరొక మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రేలంగి మామ. విరాట్ కర్ణ ని హీరోగా పరిచయం చేస్తూ మిర్యాల శ్రీకాంత్ రెడ్డి నిర్మాణంలో పెద్దకాపు సినిమాను అనౌన్స్ చేశాడు శ్రీకాంత్ అడ్డాల. రిలీజ్ చేసిన సినిమా పోస్టర్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఓ సామాన్యుడి కథ అనే ట్యాగ్ లైన్ తో ఉన్న పోస్టర్లో హీరో మాస్ అండ్ రఫ్ లుక్ తో కనిపిస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించనున్నాడు అడ్డాల. క్లాస్ సినిమాలు చేసే దర్శకులు మాస్ సినిమాలు చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో గతంలో రంగస్థలం సినిమాతో సుకుమార్, అరవింద సమేత సినిమాతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చూపించారు. ఇప్పుడు అదే తరహాలో శ్రీకాంత్ అడ్డాల కూడా తన పంథా మార్చుకొని మాస్ జానర్లో సినిమా చేయనుండటంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.

గోదావరి జిల్లాల బ్యాక్డ్రాప్ లో పొలిటికల్ డ్రామా తెరకెక్కనున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించనున్నాడు. ఏది ఏమైనా జానర్ అయితే మార్చాడు కానీ, తన స్ట్రెంత్ అయిన గోదావరి జిల్లాల బ్యాక్డ్రాప్ ని మాత్రం వదల్లేదు శ్రీకాంత్ అడ్డాల. మరి, చాలా గ్యాప్ తర్వాత సొంత కథతో వస్తున్న రేలంగి మామ ఈ సినిమాతో హిట్ అందుకొని కమ్ బ్యాక్ ఇస్తాడా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు