RRR : ఆర్.ఆర్.ఆర్ ..డిజిటల్ రిలీజ్ విషయంలో మనసు మార్చుకుందా?

రాంచరణ్ – రాజమౌళి – ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ చిత్రం మార్చి 25 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మే 14 తో 50 రోజులు పూర్తి చేసుకుంటుంది. దీంతో ఓటిటి రిలీజ్ కు ప్రయత్నాలు మొదలయ్యాయి. మే 20 న ఎన్టీఆర్ పుట్టినరోజు. అతని బర్త్ డే కి ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. దాంతో ఆయన పుట్టిన రోజు కానుకగా ఓటిటి లో ఆర్.ఆర్.ఆర్ ను విడుదల చేయాలి అనే ప్రయత్నాలు జరిగాయి. Zee Plex లో పే పర్ వ్యూ పద్దతిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. జీ5 లో మాత్రం తర్వాత విడుదల చేయాలని భావించారు. కానీ 50 రోజులు పూర్తయ్యాక కూడా ఆర్.ఆర్.ఆర్ ను టికెట్ పెట్టి కొనుక్కుని చూడడం కష్టం.

ఒకవేళ అలా చేసినా పైరసీ వెబ్ సైట్లు గంటలో డౌన్ లోడ్ చేసి ఆన్లైన్ లో పెట్టేస్తారు. తర్వాత జీ ప్లెక్స్ లో బుకింగ్స్ జరగవు, జీ5 లో చూసే జనాలు ఉండరు. అందుకే ఆ పే పర్ క్లిక్ వ్యవహారాన్ని విరమించుకుని జీ5 లో కూడా రిలీజ్ చేసేస్తున్నారు ఆర్.ఆర్.ఆర్ టీమ్ సభ్యులు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు