Oscar for RRR.. ఆందోళనలో అల్లు ఫ్యామిలీ ?

దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” చిత్రంలోని సెన్సేషనల్ సాంగ్ ” నాటు నాటు” కి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. అమెరికాలోని డాల్బీ థియేటర్లో 95వ ఆస్కార్స్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు ఆర్ఆర్ఆర్ టీం హాజరైంది. నాటు నాటు లైవ్ మ్యూజిక్ పర్ఫామెన్స్ తో రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ అదరగొట్టారు. అనంతరం అవార్డును ప్రకటించడంతో ఎంఎం కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ ఆస్కార్ వేదికపై ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించారు. నాటు నాటుకు ఆస్కార్ దక్కడం పట్ల భారతీయులు ఉప్పొంగిపోయారు.

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. సీనియర్ స్టార్ హీరోలతో పాటు పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు వంటి ఈతరం స్టార్స్ సైతం నాటు నాటుకు ఆస్కార్ రావడం పట్ల సోమవారమే తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆస్కార్ వచ్చిన సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించకపోవడం చర్చనీయాంశం అయింది. అల్లు అర్జున్ సోమవారం తన స్పందన ఎందుకు తెలపలేదు? అనేది డిస్కషన్ పాయింట్ అయింది.

ఆయన మీద నెగిటివ్ పోస్టులు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు అల్లు అభిమానులు బన్నీ ‘పుష్ప 2″ చిత్రీకరణలో బిజీగా ఉన్నందువల్ల సోమవారం బన్నీకి ఆస్కార్ వచ్చిన విషయం తెలియదని అంటున్నారు. ఇక కొంతమంది నెటిజన్లు.. ఆస్కార్ రావడం అల్లు ఫ్యామిలీకి ఇష్టం లేదని, రామ్ చరణ్ కి పేరు వస్తుందనే ఆందోళనలో అల్లు ఫ్యామిలీ ఉందని, అందుకే అల్లు అర్జున్ స్పందించలేదని అంటున్నారు.

- Advertisement -

సోషల్ మీడియాలో నెగిటివ్ పోస్టులు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ట్వీట్ చేశారని అంటున్నారు. మెగా ఫ్యామిలీకి.. అల్లు ఫ్యామిలీకి మధ్య చెడిందనే టాక్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. పవన్ పేరును తాను చెప్పనని ఒక వేదికపై బన్నీ చెప్పడం.. అతనిని మెగాస్టార్ అంటూ అభిమానులు పిలుస్తున్నా ఆయన వాటిని ఖండించకపోవడం, గీత ఆర్ట్స్ లో చిరూ సినిమా చేయకపోవడం ఈ రకమైన ప్రచారానికి కారణమైంది. అలాగే ఈ మధ్య కాలంలో అల్లు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా.. పోటీ పడి మరి వివాదాస్పదమైన హ్యాష్ ట్యాగ్స్ ను ట్రెండ్ చేసిన సంగతి విధితిమే.

అయితే అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ బాగానే ఉన్నారని, అభిమానులు మాత్రమే ఇలాంటి రూమర్స్ ను క్రియేట్ చేస్తున్నారని అల్లు, మెగా ఫ్యామిలీ సన్నిహితులు అంటున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు