Sadha : లేటు వయసులో పెళ్లికి రెడీ ?

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ చాలా మంది ఉన్నారు. కానీ వారందరికీ ప్రస్తుతం పెళ్లీ టైం వచ్చేసింది. ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇటీవలే శర్వనాంద్.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రక్షిత రెడ్డితో ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలిసిందే. అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా పెళ్లికి రెడీ అంటున్నాడు. దీనిపై ఇటీవలే మెగా బ్రదర్ ఓ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ కూడా పెళ్లికి సిద్ధం అంటూ ప్రకటించింది. ఇప్పటి వరకు పెళ్లికి దూరంగా ఉంటూ, సింగిల్ లైఫ్ ను ఎంజాయ్ చేసిన ఈ హీరోయిన్ తాజాగా పెళ్లి చేసుకోవడానికి రెడీ గా ఉందని ప్రకటించింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. జయం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, “వెళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ..” అనే డైలాగ్ తో పాపులర్ అయిన సదా.

సదా జయం తర్వాత తెలుగుతో పాటు తమిళంలో కూడా చాలా సినిమాలు చేసింది. ప్రస్తుతం సినిమాల కంటే బుల్లితెరపై కామెడీ, డ్యాన్స్ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహిరిస్తూ వస్తుంది. అయితే సదా 38 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. దీనికి కారణం అనేక సార్లు వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఆమె పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నానని ప్రకటించింది అందరినీ ఆశ్చర్యపరిచింది.

- Advertisement -

ఇటీవల సదా పెళ్లిపై స్పందిస్తూ.. తన మనసుకు నచ్చిన వారు దొరికితే త్వరలోనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత సదా పెళ్లి గురించి నెట్టింట్లో ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. సదా తన చిన్ననాటి స్నేహితుడితో పెళ్లి పీటలెక్కబోతుందట. గత కొంత కాలం నుంచి వీరు డేటింగ్ లో కూడా ఉన్నారని సమాచారం. దీనిపై త్వరలోనే వీళ్లు అధికారిక ప్రకటన చేయాలని ఆలోచిస్తున్నారని సమాచారం. అయితే ఈ వార్తలు నిజమో కాదో.. తెలియాలంటే స్వయంగా సదా స్పందించాల్సిందే.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు