Sakshi Vaidya : ల‌క్కిఛాన్స్‌

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒక‌రైన రామ్ పోతినేని గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ముఖ్యంగా ఆయ‌న దేవ‌దాస్ సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయి తొలి సినిమాతో స‌క్సెస్ అందుకున్నాడు. ఆ త‌రువాత వ‌చ్చిన జ‌గ‌డం అంత‌గా ఆక‌ట్టుకోక‌పోయిన‌ప్ప‌టికీ.. రెడీ సినిమా మంచి స‌క్సెస్‌ని అందించింది. ఇక అక్క‌డి నుంచి వ‌రుస సినిమాల‌తో దూసుకెళ్తున్నాడు.

ఇటీవ‌ల ‘వారియర్’ తర్వాత రామ్ పోతినేని తన తర్వాత సినిమాపై దృష్టి పెట్టారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని తన తర్వాత చిత్రం చేస్తున్న సంగతి విధితమే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. త్వరలోనే ఈ చిత్రం అక్టోబర్ 6 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ సినిమాను బోయపాటి పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ‘RAPO20’ అనే వర్కింట్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని, షూటింగ్ కోసం రెడీ గా ఉంది. కాగా దీనికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

అయితే ఈ సినిమా గురించి తాజాగా ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అక్కినేని అఖిల్ హీరో నటిస్తున్న ఏజెంట్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న సాక్షి వైద్య ను చిత్ర యూనిట్ ఎంపిక చేసిందట. దీనిపై చిత్ర యూనిట్ నుండి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే సూచనలు కూడా ఉన్నాయని సమాచారం అందుతుంది. సాక్షి వైద్య హీరోయిన్ గా ఏజెంట్ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. ఈ చిత్రం రిలీజ్ కాకముందే ఈమె కు మరో లక్కి ఛాన్స్ వచ్చింది. తొలి చిత్రం షూటింగ్ దశలోనే ఉన్న సమయంలో ఈ యంగ్ హీరోయిన్ కు స్టార్ హీరో సరసన అవకాశం రావడం విశేషం. కాగా ఏజెంట్ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు