Salaar : కథ క్లైమాక్స్ కి..

ఈశ్వర్ సినిమా తో ప్రేక్షకులకు పరిచయం అయిన ప్రభాస్ తన నటన తో అందరిని ఆకట్టుకున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు ప్రభాస్. ఇక ఇటీవల కాలంలో ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా తరువాత ఆది పురుష, సలార్, ప్రాజెక్ట్ కే , స్పిరిట్ సినిమాలకు సైన్ చేసారు. కానీ ఇంత వరకు ఏ సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు.

వీటిలో డార్లింగ్ ఫాన్స్ అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న చిత్రం సలార్. ఈ సినిమా మీద అభిమానులకి చాలా ఆశలు ఉన్నాయని చెప్పవచ్చు. ఈ సినిమా నుంచి తాజాగా ఒక అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను నిర్మిస్తున్నహోంబేల్ ఫిలిం ప్రొడక్షన్ హౌస్ అధినేత విజయ్ కిరుగందుర్ సలార్ గురించి ఆసక్తిరమైన విషయాలను వెల్లడించారు.

సలార్ సినిమా షూటింగ్ 80 శాతం వరకు పూర్తి అయిపొయిందని, ఇక క్లైమాక్స్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలిపాడు. ఇక ఈ క్లైమాక్స్ షూటింగ్ జనవరి లో ప్రారంభించబోతున్నామని నిర్మాత విజయ్ వెల్లడించాడు. అయితే ఈ సినిమాను 2023 లో సెప్టెంబర్ 28 న విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే అధికారిక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాటానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. జనవరి నుండి క్లైమాక్స్ షూటింగ్ మొదలు పెట్టి ఫిబ్రవరి లోగా పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను పక్కాగా ప్లాన్ చేయాలని, అన్నీ పనులు పూర్తి చేసుకున్న తర్వాతే తెర మీదికి తీసుకురావాలని డైరెక్టర్ ప్రశాంత్ భావిస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు