Salaar: జెట్ స్పీడ్ లో సలార్ – అనుకున్న డేట్ కి రిలీజ్ అవుతుందా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సలార్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలం అవుతున్నా కూడా ఎలాంటి అప్డేట్ లేకపోవటంతో ప్రభాస్ అభిమానులు సలార్ సినిమా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇది ఫుల్ లెంత్ యాక్షన్ మూవీ కావటంతో ఆదిపురుష్ కంటే కూడా ఈ సినిమా మీదనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ క్రమంలో ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ, ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అదేంటంటే, ఈ సినిమా షూటింగ్ 90శాతం వరకు పూర్తయ్యిందని, లాస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగనుందని, రెండురోజుల పాటు షూట్ జరిగితే ప్రభాస్ పార్ట్ పూర్తవుతుందని సమాచారం అందుతోంది.

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సలార్ సినిమా గురించి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న తరుణంలో వినిపిస్తున్న ఈ వార్త ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతుంది. అంతే కాకుండా, ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్ రూపొందించాడని టాక్ వినిపించటంతో సినిమాకు కావాల్సినంత హైప్ క్రియేట్ అయ్యింది.

ప్రస్తుతం ఆదిపురుష్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్, ఆ సినిమా రిలీజ్ అయ్యాక లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొంటాడని సమాచారం అందుతోంది. సెప్టెంబర్ 28న విడుదల సన్నాహాలు చేస్తున్న సినిమా యూనిట్, ఎలా అయినా అనుకున్న సమయానికే సినిమా రిలీజ్ చేసి తీరాలన్న పట్టుదలతో ఉన్నారట. మరి, దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నట్లు టీజర్ ని ఆదిపురుష్ సినిమాతో కలిపి రిలీజ్ చేస్తారా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు