Samantha : ఈ ఏడాదిలోనే..

టాలీవుడ్ అగ్ర హీరోయిన్‌ల‌లో స‌మంత ఒక‌రు. ఈమె భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో విడాకులు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి వ‌రుస సినిమాల‌తో బిజీగా గ‌డుపుతోంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటేడ్ సినిమాల‌ను చేస్తుంది. అందులో ముఖ్యంగా య‌శోద‌, శాకుంత‌లం సినిమాలు పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌ల అవుతున్నాయి. ఇక ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 45 సినిమాల్లో న‌టించింది స‌మంత‌.ప్ర‌తి పాత్ర‌లో ప‌లు ర‌కాల వేరియేష‌న్స్ చూపిస్తూ సినిరంగంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం శాకుంత‌లం క్రియేటివ్ జీనియ‌స్‌ గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ కూతురు నీలిమ‌, నిర్మాత దిల్ రాజుతో క‌లిసి రూపొందించిన చిత్రం శాకుంతలం. ఈ సినిమాలో స‌మంత‌దే కీల‌క పాత్ర‌. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యి చాలా రోజులు అవుతోంద‌ట‌. ఈ చిత్రానికి దిల్ రాజు ఒక నిర్మాత కావ‌డంతో ఎప్పుడు విడుద‌ల చేయాల‌న్న‌ది ఆయ‌నే డిసైడ్ చేస్తారు. ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ఈ చిత్రం విడుద‌ల చేసే విష‌యం పై చాలా సైలెంట్‌గానే ఉన్నారట‌. తొలుత సంక్రాంతికి విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, రెబ‌ల్ ప్ర‌భాస్, విజ‌య్‌- వంశీ సినిమాలు ఉండ‌డంతో అంత‌కంటే ముందుగానే డిసెంబ‌ర్‌లోనే విడుద‌ల చేయాల‌ని దిల్ రాజు చూస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా డిసెంబ‌ర్ మొద‌టివారంలోనే విడుద‌ల చేస్తే బెట‌ర్ అని దిల్ రాజు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు డిసెంబ‌ర్ తొలివారంలో ధ‌నుష్ న‌టిస్తున్న‌ స‌ర్‌, నాని నిర్మిస్తున్న హిట్ 2 సినిమాలు వ‌స్తున్నాయి. ఈ సినిమాల త‌రువాత శాకుంత‌లం విడుద‌ల చేస్తార‌నే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి స‌మంత అమెరికా నుంచి వ‌చ్చిన త‌రువాత శాకుంత‌లం డేట్‌ని ప్ర‌క‌టించ‌నున్నార‌ట‌.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు