Kushi : సమంత స్పీడ్..

టాలీవుడ్ క్వీన్ సమంత, డైవర్స్ తర్వాత స్పీడ్ పెంచేసింది. వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ ఫుల్ జోష్ లో ఉంది. అక్కినేని నాగ చైతన్యతో రిలేషన్ లో ఉన్న సమయంలో యూ టర్న్, మజిలీ, ఓ బేబీ, జాను లాంటి సినిమాల్లో పద్దతిగా నటించింది. అయితే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఒరిజినల్ ఫ్యామిలీ మ్యాన్ – 2 లో నటించిన తర్వాతే, సమంత జీవితంలో పెను మార్పులు జరిగాయని ఎవరినీ అడగినా చెబుతారు.

డైవర్స్ తీసుకున్న తర్వాత, సమంత పూర్తి స్వేచ్ఛగా ఉంటుంది. ఫ్రెండ్స్ తో టూర్స్, వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బిజీగా గడుపుతుంది. స్టోరీ నచ్చితే ఎలాంటి పాత్రలకైనా సిద్ధమంటుంది. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ – 2 తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ కు సైన్ చేసింది. అల్లు అర్జున్ – సుకుమార్ పుష్ప సినిమాలో “ఊ అంటావా.. మావా.. ఊ ఊ అంటావా..” అంటూ ఐటెమ్ సాంగ్ కు చిందేసి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

ప్రస్తుతం సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండతో “ఖుషి” సినిమా చేస్తుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజై ఆకట్టుకుంటుంది. అయితే ఈ మూవీలో సమంత-విజయ్ మధ్య లిప్ లాక్ సీన్ ఉంటుందని గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. దీంతో డైవర్స్ తర్వాత సమంత ఫ్రీడమ్ మూడ్ లోకి వచ్చి నటిస్తుందని, అందుకు ఇది మరొక ఉదాహారణ అని నెటిజన్లు అంటున్నారు. నిజానికి సమంత ప్రస్తుతం సినిమాల్లో పూర్తి స్వేచ్ఛగా నటిస్తూ, తన పాత్రకు వంద శాతం న్యాయం చేస్తుంది.

- Advertisement -

కాగా, ఖుషి సినిమా పూర్తి లవ్ స్టోరీతో తెరకెక్కుతుందట. తన కంటే రెండేళ్ల చిన్న వాడైన విజయ్ తో సమంత లవ్ లో పడుతుందని, విజయ్ ఈ మూవీలో రేసర్ పాత్రలో కనిపించబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు