Yashoda : సామ్ స్టోరీనే సినిమా స్టోరీ ?

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది. ఇటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు బాలీవుడ్ లో వెబ్ సిరీస్ తో పాటు ప‌లు సినిమాలకు సైన్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఈమె ముఖ్య పాత్రలో చేసిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు యశోద, శాకుంతలం. దీనిలో యశోద సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో హరి-హరీష్ స్వీయ‌ రచన, దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. శ్రీ దేవీ మూవీస్ పతాకం పై శివ లెంక కృష్ణ‌ప్రసాద్ నిర్మిస్తున్నారు.

తమిళ, తెలుగు ద్వి భాష చిత్రంగా వస్తున్న యశోదలో సమంతతో పాటు ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించ‌నున్నారు. కాగా ఈ చిత్రం నవంబర్ 11న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతే కాకుండా ఈ స్టోరీని సమంత నిజ జీవితానికి పోల్చుతున్నారు. ఆ స్టోరీ ఏంటంటే.. చిత్రంలో ముకుందన్ ఒక మెడిసిన్ ను కనిపెడుతాడు. దానిని తీసుకుంటే వయసు కాస్త చిన్నగా కనిపిస్తుంది. అలాగే ఆ మెడిసిన్ తీసుకున్న వారిలో మార్పులు కూడా బాగా వస్తాయి. దీనికి కోసం సమంత విదేశాలకు వెళ్తుంది.

ఆ మెడిసిన్ పొందే వరకు జరిగిన ఈ ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న సమస్యలేంటి అనేదే యశోద సినిమా. అని టాక్ వినిపిస్తుంది. గతంలో సమంత తన చర్మ సమస్యల చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రంలో కూడా అలాంటిదే ఉండటంతో యశోద సినిమాను సామ్ నిజ జీవితానికి పోల్చుతున్నారు. మరి ఈ కథ నిజమో కాదో తెలియాలంటే వచ్చే నెల 11వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు