Samantha: కఠిన సమయంలో నాకు చేరువయ్యావు…

హీరోయిన్ సమంత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇక సమంత టైటిల్ పాత్రలో నటిస్తున్న తాజా సినిమా శాకుంతలం. మహాభారతంలోని శకుంతల, దుశ్యంతుల ప్రయాణగాత ఆధారంగా మైతలాజికల్ లవ్ స్టోరీగా దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో దుష్యంతుడిగా మలయాళం నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. దుర్వాస మహామునిగా మోహన్ బాబు కనిపించారు. గౌతమి సుబ్బరాజు తో పాటు పలువురు టాలీవుడ్ నటీనటులు కీలక పాత్రలను పోషించారు. ఫిబ్రవరి 17న దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లో శాకుంతలం సినిమా రిలీజ్ కానుంది. ఇది ఇలా ఉండగా,

మయోసైటీస్ నుంచి కోలుకున్న హీరోయిన్ సమంత ఇప్పుడు మళ్ళీ తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టింది. మళ్ళీ ఇంతకు ముందు అంత స్ట్రాంగ్ అయ్యేందుకు జిమ్ లో వర్కౌట్స్ మొదలుపెట్టింది. తన తదుపరి ప్రాజెక్టు కోసం రెడీ అవుతోంది. మళ్ళీ నార్మల్ గా మారుతున్న సామ్ ను చూసి ఆమె అభిమానులు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ క్రమంలో జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో సామ్ షేర్ చేసింది.

- Advertisement -

క్లిష్టమైన సమయంలో నాకు తోడుగా ఉండి, నాలో స్ఫూర్తి నింపిన who is the gravity బ్యాండ్ కు ముందుగా సమంత ధన్యవాదాలు చెప్పింది. సాధ్యమైనంత వరకు కఠినమైన డైట్ పాటించినంత మాత్రాన తగినంత బలం రాదని, ముందు మన ఆలోచన విధానంలో మార్పు రావాలని పేర్కొంది. దీంతోపాటు జిమ్ లో పుష్ అప్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఈ పోస్ట్ పై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆలియా భట్, దేవ్ మోహన్, సుస్మిత కొణిదెల, రుహాని శర్మ, సోఫీ చౌదరి తదితరులు ఆమెకు మద్దతు తెలుపుతూ కామెంట్లు పెట్టారు.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు