Legend : అరెరే.. ఛాన్స్ మిస్ అయిందే

ఈ మధ్య కాలంలో ట్రోలర్స్ పని చేప్పిన సినిమా ఏదైనా ఉందా అంటే.. అది శరవణన్ నటించిన లెజెండ్ అని చెప్పొచ్చు. జూలై 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 60 కోట్లతో శరవణన్ ఈ సినిమాను నిర్మించాడు. అయితే ఇది ప్రేక్షకులకు ఏ మాత్రం నచ్చలేదు. అంతే కాకుండా అసలు ఈ సినిమా ఎందుకు తీశారు అనే భావన కూడా వచ్చింది. అయితే చాలా మంది ఈ సినిమాను థియేటర్ కు వెళ్లి చూడాలేదు.

కానీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసి శరవణన్ యాక్టింగ్ చూసి కడుపుబ్బా నవ్వాలనుకున్నారు. అయితే ఈ ఛాన్స్ ను ప్రేక్షకులకు శరవణన్ ఇచ్చేట్టు లేడు. తన ది లెజెండ్ సినిమాను ఓటీటీకి గానీ, టీవీ స్ట్రీమింగ్ కు గానీ ఇచ్చేందుకు శరవణన్ సిద్ధంగా లేడని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. కొన్ని ఓటీటీ ప్లాట్ ఫాంలు లెజెండ్ సినిమా హక్కులను కొంత ఎక్కువ మొత్తానికే దక్కించుకోవడానికి ట్రై చేశాయట. కానీ శరవణన్ నిర్ణయం వల్ల అది జరగలేదని సమాచారం.

దీంతో ఈ సినిమా చూడలేని వారు, ట్రోలర్స్ కొంత వరకు అసంతృప్తికి గురవుతున్నారు. ఒక వేళ ఈ సినిమా ఓటీటీ వస్తే.. మాత్రం ట్రోలర్స్, మీమ్ మేకర్స్ ఫుల్ బిజీ గా ఉండేవారు. సినిమాలోని శరవణన్ క్లారిటీ ఫోటోలతో ట్రోల్స్, మీమ్స్ విపరీతంగా వచ్చేవి. కానీ ఛాన్స్ మనకు లేదు .

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు