Adipurush: ప్రభాస్ లుక్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ నటి.. !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రామాయణం  ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. జూన్ 16న రిలీజ్ కానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. మొదట్లో నాసిరకం విజువల్స్ కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సినిమా యూనిట్ తప్పులు సరిదిద్దుకొని ట్రైలర్ లో అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్ తో  గట్టి సమాధానం ఇచ్చింది. ట్రైలర్ తో మొదలుకొని ఆ తర్వాత వచ్చిన ప్రతి అప్డేట్ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెంచాయి. ఇదిలా ఉండగా, సీనియర్ నటి కస్తూరి ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ లుక్ పై సంచలన కామెంట్స్ చేసింది. ప్రభాస్ రాముడిలా కాదు, కర్ణుడిలా కనిపిస్తున్నాడని కస్తూరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

తెలుగు సినిమాల్లో రాముడి పాత్రలో చాలా మంది హీరోలు నటించారని, వారిలో ఏ ఒక్కరు కూడా మీసాలతో కనిపించలేదని, చాలా అందంగా కనిపించారని అభిప్రాయం వెల్లడించింది. నిజానికి రాముడు ఇలాగే ఉండాలని ఎక్కడ ప్రస్తావన లేనప్పటికీ మొదటి నుండి సినిమాల్లో ఒకేలా  చూపించటం వల్ల అదే రూపం ప్రేక్షకుల మనస్సులో రిజిస్టర్ అయ్యింది. ఇదే ఇప్పుడు రాముడిగా ప్రభాస్ లుక్స్ విషయంలో విమర్శలకు దారి తీస్తోంది.

నిజానికి శివుడు కూడా చాలా ఫోటోల్లో మీసాలు లేకుండానే కనిపిస్తాడు కానీ, చిరంజీవి లాంటి హీరోలు సినిమాల్లో మీసాలతో శివుడి గెటప్ లో కనిపించి ఆకట్టుకోగా, ప్రేక్షకులు కూడా యాక్సెప్ట్ చేశారు. మొత్తానికి కస్తూరి కామెంట్స్ ని కొంతమంది సమర్దిస్తుండగా ప్రభాస్ అభిమానులు మాత్రం ఖండిస్తున్నారు.కస్తూరి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వివాదాన్ని ఎంతవరకు తీసుకెళ్తారో అన్న ఆసక్తి నెలకొంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు