Prabhas : అక్క పాత్రలో సీనియర్ హీరోయిన్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత చేస్తున్న సినిమాలన్నీ కూడా హై బడ్జెట్ లోనే ఉంటున్నాయి. ఈ భారీ సినిమాల మధ్య చిన్న సినిమాల చేయాలని డార్లింగ్ అనుకున్నాడు. ఈ క్రమంలో మారుతితో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీనిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలను చాలా రోజుల క్రితమే ముగించుకోగా, ఇటీవల మొదటి షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది.

ఒక పాత పడిన రాజా డీలక్స్ అనే థియేటర్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. దీనికి రాజా డీలక్స్ అనే టైటిల్ ను కూడా డైరెక్టర్ మారుతి ఫిక్స్ చేశాడని టాక్. అలాగే తాత మనవళ్ల స్టోరీ అని, తాతగా బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ నటించబోతున్నాడని, ఇందులో ప్రభాస్ కు జోడగా ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని ఇలా చాలా రూమర్స్ వస్తున్నాయి. మరి ఈ పుకార్లు ఎంత వరకు నిజమో తెలియదు గానీ, కొత్తగా ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్ వినిపిస్తుంది.

ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ భూమిక కనిపించబోతుందట. పవన్ కళ్యాణ్ తో ఖుషి, తారక్ తో సింహాద్రి వంటి హిట్ సినిమాల్లో నటించిన భూమిక పెళ్లి తర్వాత కూడా కొన్ని రోజుల పాటు సినిమాల్లో కనిపించింది. అయితే ప్రస్తుతం ఈ భామ సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోలకు అక్క, వదిన పాత్రలు చేస్తోంది. తాజాగా ప్రభాస్-మారుతి సినిమాలో హీరోకు అక్క పాత్రలో ఈ సీనియర్ హీరోయిన్ నటిస్తుందట. దీనిపై ఇప్పటి వరకు అయితే అధికారిక ప్రకటన రాలేదు. కానీ మారుతి ఈ సినిమాల్లో ఉన్న నటీనటుల గురించి ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూా ఇవ్వలేదు.

- Advertisement -

ఇప్పటికే ప్రభాస్ లేకుండా ఒక షెడ్యూల్ ను మారుతి పూర్తి చేశాడు. మరో షెడ్యూల్ కూడా స్టార్ట్ కాబోతుందని సమాచారం. అయినా సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడించడం లేదు. అందుకే కాబోలు.. ఇలాంటి వార్తలు పుట్టుకువస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు