Sriram: చైతూ సినిమా విషయంలో నాకు అన్యాయం జరిగింది – శ్రీ రామ్..!

హీరో శ్రీరామ్.. ఈ పేరు చెప్పగానే ముందుగా ‘ఒకరికి ఒకరు’ సినిమా గుర్తొస్తుంది. ఈ సినిమా తర్వాత అమ్మాయిలకు ఫేవరెట్ హీరోగా మారిపోయిన శ్రీరామ్ ఆ తర్వాత పెద్దగా తెలుగులో కనిపించలేదు. తమిళ్‌లో శ్రీకాంత్‌గా సెటిల్ అయిన శ్రీరామ్ తెలుగులో పెద్దగా ఎందుకు కనిపించలేదు.. శ్రీరామ్ మొదట కె. బాలచందర్ టీవీ సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చారు. 2002 లో వెండితెరపై కనిపించిన మొదటి సినిమా ‘రోజా కూటం’. ఈ సినిమా ‘రోజా పూలు’ గా తెలుగులో డబ్ చేశారు. ఆ తరువాత ఏప్రిల్ మధతిల్, మనసెల్లం, పార్తిబన్ కనవు వంటి తమిళ్ సినిమాలతో దూసుకుపోయారు. ఆ తర్వాత తెలుగులో కూడా ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, దడ, వై, అసలేం జరిగింది, రావణాసురుడు వంటి సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించారు.

ఇదిలా ఉండగా తాజాగా శ్రీరామ్ నటించిన చిత్రం పిండం. ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యంగా తెలుగులో వస్తున్న హారర్ సినిమా ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇదివరకే డిసెంబర్ 7వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలవగా ఆద్యంతం ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

అంతేకాదు ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న శ్రీరామ్ తన సినిమా కెరియర్ లో జరిగిన విషయాలను ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ నాగచైతన్య హీరోగా నటించిన దడ సినిమాలో తనకు జరిగిన అన్యాయం గురించి కూడా వెల్లడించారు. పిండం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీరామ్ మాట్లాడుతూ… దడ సినిమా కథను డైరెక్టర్ అజయ్ భుయాన్ ఒకరకంగా చెప్పారు. ఆ తర్వాత తీసింది ఒకటి . అయితే ఇందులో దర్శకుడిని తప్పు పట్టడానికి లేదు. అతడు ఒక హెల్ప్ లెస్ ..అయితే ఈ సినిమా కోసం నేను డూప్ లేకుండా చాలా రిస్క్ చేసి కొన్ని యాక్షన్ సన్నివేషాలలో చేశాను.

- Advertisement -

అయితే చివర్లో అసలు ఆ సన్నివేషాలు లేకుండా చేశారు. అలా నా టాలెంట్ ను నిరూపించుకోవాలనుకున్నప్పుడు అన్యాయం జరిగింది. ఒకవేళ అక్కడ ఆ సన్నివేశాలు ఉండి ఉంటే కచ్చితంగా.. నేడు నేను మరో ఫీట్ అందుకునే వాడినేమో అంటూ శ్రీరామ్ బాధపడ్డారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు