Shruti Haasan : టాలీవుడ్ లో మరో ఛాన్స్ ?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న హీరోయిన్ లలో శ్రుతి హాసన్ ఒకరు. సంక్రాంతి పోటీలో ఉన్న వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల్లో హీరోయిన్ గా నటించింది శ్రుతి హాసన్. ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకెళ్తున్నాయి. దీంతో శ్రుతి హాసన్ సినీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీస్ లిస్ట్ లో ఒకే సారి రెండు సినిమాలు చేరిపోయాయి. దీంతో శ్రుతి హాసన్ తో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో భాగంగా శ్రుతి హాసన్ టాలీవుడ్ లో మరో క్రేజీ ఆఫర్ ను కొట్టేసినట్టు సమాచారం.

డైరెక్టర్ శ్రీవాస్, గోపిచంద్ కాంబినేషన్ లో హ్యాట్రీక్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా తమ హ్యాట్రీక్ మూవీకి సంబంధించిన పోస్టర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి రామబాణం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ ను అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో గోపిచంద్ కు బాలయ్య సూచించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబౌట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో డింపుల్ హయాతి, జగపతి బాబు, ఖుస్బు కీలక పాత్రల్లో నటించబోతున్నారు. అయితే రామబాణం గురించి ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో శ్రుతి హాసన్ ను మేకర్స్ ఎంపిక చేశారట. సంక్రాంతిలో రెండు వరుస సినిమాల విజయాలతో ఫుల్ జోష్ తో ఉన్న శ్రుతి హాసన్ రామబాణంలో హీరోయిన్ గా ఉంటే.. సినిమాకు ప్లస్ అవుతుందని మేకర్స్ భావించారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.

- Advertisement -

కాగా శ్రుతి హాసన్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ తో పాటు ది ఐ అనే హాలీవుడ్ మూవీ చేస్తోంది.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు