GodFather : ఆ లోటు తీరుతుందా ?

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే.. మాస్ ఎలివేషన్స్, హీరోయిన్స్ తో స్టెప్స్, రొమాన్స్, కామెడీ అన్ని సమపాలల్లో ఉంటాయి. నిజానికి మెగాస్టార్ అలాంటి స్టోరీలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. కానీ మొదటిసారి చిరంజీవి ఇలాంటివేవీ లేకుండా ఒక పొలిటికల్ కన్సెప్ట్ తో వస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ అనే సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్నారు. దీనికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి సినిమాలంటనే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. దీనికి తోడుగా, బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, యంగ్ హీరో సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా కనిపించడంతో అంచనాలు మరింత స్థాయికి వెళ్లాయి. అలాగే ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు, టీజర్, సాంగ్ ఈ సినిమాపై హైప్ ను మరింత పెంచేలా చేశాయి. ఏది ఏమైనా ఈ సినిమాలో హీరోయిన్స్ తో చిరంజీవి డ్యాన్స్ లేకపోవడం ఒక లోటు అనే చెప్పొచ్చు. కనీసం ఐటెం సాంగ్ కూడా లేదని మెగా అభిమానులు ఇప్పటి వరకు తీవ్ర నిరాశలో ఉన్నారు.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త మెగా అభిమానులను ఒక రకంగా సంతోషాన్ని ఇస్తుంది. అదేంటంటే.. గాడ్ ఫాదర్ లో ఓ ఐటెం సాంగ్ ను పెట్టారంట. బింబిసారలో కళ్యాణ్ రామ్ తో ఆడిపాడిన వారినా హుస్సేన్.. ఈ ఐటెం సాంగ్ చేసిందని టాక్. వారినా హుస్సేన్, మెగాస్టార్ చిరంజీవి మధ్య స్పెషల్ సాంగ్ ఉంటుందని సమాచారం.

- Advertisement -

ముందుగా చిరు-సల్మాన్ కలిసి చేసిన తార్ మార్ తక్కర్ మార్ సాంగ్ నే స్పెషల్ సాంగ్ భావించారట. కానీ ఈ సాంగ్ ను సినిమాలో పెట్టడానికి స్కోప్ లేకపోవడంతో రోలింగ్ టైటిల్స్ మీదకు మార్చేసారని తెలుస్తోంది. దీన ప్లేస్ లో వారినా హుస్సేన్ తో ఐటెం సాంగ్ చేశారని టాలీవుడ్ సర్కిల్స్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్పెషల్ సాంగ్ షూటింగ్ కూడా పూర్తి అయిందట.

మొత్తంగా గాడ్ ఫాదర్ లో స్పెషల్ సాంగ్ ఉంటుందని వార్తలు రావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. చిరు మార్క్ స్టెప్ లు ఈ ఐటెం సాంగ్ లో చూడచ్చని అనుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు