Sreeleela : ఆఫర్లు.. రెమ్యూనరేషన్

దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందD సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ శ్రీ లీల. తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది శ్రీలీల. ఈ క్రమంలోనే శ్రీలీలకు తెలుగు సినిమాలలో చక్కటి అవకాశాలు లభించాయి. వరుస సినీ ఆఫర్లు రావడంతో ఈ భామ అనధి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ లోకి వెళుతుందని సినీ పరిశీలకులు అంటున్నారు.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ సరసన ధమాకా సినిమాలో ఈ అమ్మడు నటిస్తోంది. ఈ సినిమా పోస్టర్స్, సాంగ్ లో శ్రీలీల మరింత అందంగా కనిపిస్తుండడంతో ఈమెను తమ సినిమాలలో హీరోయిన్ గా పెట్టుకునేందుకు దర్శక నిర్మాతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమానే కాక మరో యంగ్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రంలోను శ్రీ లీల నటిస్తోంది. దీంతో శ్రీలీల రేంజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పొచ్చు.

వరుస ఆఫర్లు వస్తుండడంతో రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఈ ముద్దుగుమ్మ అమాంతం పెంచేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలా అమాంతం రెమ్యునరేషన్ పెంచేయడం కరెక్ట్ కాదని కొంతమంది భావిస్తున్నారు. 20 లక్షల పారితోషికంతో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కోటి రూపాయల వరకు తీసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ సినిమా నుంచే శ్రీ లీల కోటి రూపాయల రెమ్యూనరేషన్ ను తీసుకుంటుందని టాక్. మరి శ్రీ లీల కెరియర్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు