Sreeleela : రెమ్యునరేషన్ మళ్లీ పెంచిందా?

మాస్ మహరాజ్ రవితేజ, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన ధమాకా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. మొదటి వీకెండ్ లో రూ. 32 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి సంచలనాలను నమోదు చేస్తోంది. ఈ సినిమా హిట్ టాక్ తో పాటు హీరోయిన్ శ్రీలీల గురించి కూడా సినిమా వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. ధమాకాలో ఈ బ్యూటీ చేసిన మాస్ డ్యాన్స్, యాక్టింగ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. రాబోయే సినిమాలకు శ్రీలీల బెస్ట్ ఆప్షన్ అవుతుందని సినీ విశ్లేషకులు కూడా జోస్యం చెబుతున్నారు.

అయితే ఈ టాక్ ను క్యాష్ చేసుకోవడానికి శ్రీలీల రెడీ అవుతుందని తెలుస్తోంది. ధమాకా తర్వాత శ్రీలీల తన రెమ్యునరేషన్ ను మరింత పెంచబోతుందని తెలుస్తుంది. ఈ యంగ్ బ్యూటీ మొదటి సినిమా పెళ్లి సందD కి రూ. 20 లక్షల వరకు పారితోషికం తీసుకుందట. ఈ చిత్రంతో శ్రీలీలకు మంచి పేరు రావడంతో రెండో సినిమా ధమాకా కు రూ. 60 లక్షల నుంచి 70 లక్షల వరకు పారితోషికం తీసుకుందని టాక్. ధమాకా చిత్రంలో మొదటి సాంగ్ వచ్చిన తర్వాత నుంచి శ్రీలీల క్రేజ్ పెరిగింది.

అప్పటి నుంచే తన పారితోషికాన్ని రూ. కోటి పెంచిందని వార్తలు వచ్చాయి. రూ. కోటి పారితోషికంతో కొన్ని సినిమాలకు కూడా సైన్ చేసిందని గుస గుసలు వినిపించాయి. తాజాగా ఇప్పుడు ధమాకా హిట్ అందుకోవడం, అందులో ఈమె డ్యాన్స్, యాక్టింగ్ హైలైట్ గా ఉండటంతో శ్రీలీల మరోసారి తన రెమ్యునరేషన్ ను పెంచిందని తెలుస్తుంది. ప్రస్తుతం తన వద్దకు వస్తున్న దర్శక నిర్మాతలను రూ. 1.20 కోట్ల నుంచి రూ. 1.50 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట.

- Advertisement -

ప్రస్తుతం శ్రీలీల కంటే తక్కువ క్రేజ్ ఉన్న వాళ్లు కూడా కోటి పైగా డిమాండ్ చేస్తున్నారు. అలాంటి సందర్భంలో యూత్ ను ఎంతో ఆకర్షిస్తున్న శ్రీలీలకు రూ. 1.50 కోట్ల ఇవ్వడానికి కూడా నిర్మాతలు వెనకడగు వేయడం లేదని తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు