Sri Reddy: మాజీ ప్రియుడి కోసం ఫైర్ బ్రాండ్ పూజలు..?

టాలీవుడ్ ఫైర్ బ్రాండ్, కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మిగిలిన శ్రీరెడ్డి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంచలనాలు, వివాదాలతో శ్రీరెడ్డి వెలుగులోకి వచ్చారు. ఈమె ఎవరినైనా టార్గెట్ చేసిందంటే ఇక వారి పొట్టుపూర్వత్రాలతో సహా అతడి రహస్యాలను కూడా బయటపెట్టి.. సమాజంలో వారి పరువు తీస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆమె మీటూ, కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని నడిపించిన తీరు, చేసిన పనులు, మాట్లాడిన మాటలు కాస్త అదుపు తప్పినా కూడా.. సమస్య మాత్రం ఉందని అందరికీ అర్థమైంది.

దీని తర్వాత టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ బాధితులంతా ఒక్కొక్కరిగా బయటకు వచ్చారు. ఫిలిం ఛాంబర్ ముందు శ్రీరెడ్డి అర్ధ నగ్న ప్రదర్శన చేయడంతో జాతీయస్థాయిలో ఆమె పేరు ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. శ్రీ రెడ్డి వల్లే స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు చిన్న కుమారుడు దగ్గుబాటి అభిరామ్ వార్తల్లో నిలిచాడు. అతని గురించి చాలా విషయాలు బయట పెట్టింది శ్రీరెడ్డి. తనను వాడుకున్నాడని, అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి సర్వం దోచుకున్నాడని, అవసరాలు తీరాక తనను వదిలేసాడని ఫోటోలు, వీడియోలతో సహా రచ్చ రచ్చ చేసింది.

అయితే శ్రీ రెడ్డి చేసిన ఆరోపణలపై అభిరామ్ నుంచి గానీ, దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. అయితే ప్రస్తుతం కాంట్రవర్సీలకు పులిస్టాప్ పెట్టి పూర్తిగా మారిపోయి కృష్ణుడి ధ్యానంలో మునిగిపోయింది శ్రీరెడ్డి. అంతేకాదు సోషల్ మీడియాలో సైతం కాస్త సైలెంట్ అయింది.

- Advertisement -

ఆమెలో ఈ మార్పు దేనికోసమని ఆశ్చర్యపోతున్నారు జనాలు. అయితే తేజ దర్శకత్వంలో “అహింస” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు అభిరామ్. ఏప్రిల్ 7వ తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో శ్రీరెడ్డి తన ప్రియుడి మూవీ సక్సెస్ కోసం ఇదంతా చేస్తుందని, ప్రత్యేక పూజాలు చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇది ఎంతవరకు నిజమో చూడాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు