Sreeleela: ఆ పనికి నో అంటున్న శ్రీలీల – రిస్క్ చేస్తుందా..?

పెళ్ళిసందడి సినిమా ద్వారా టాలీవుడ్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న కన్నడ భామ శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం సీనియర్ హీరోల దగ్గర నుండి యువ హీరోల వరకు అరడజనుకి పైగా సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారింది. అందం, అభినయంతో పాటు డ్యాన్స్ లో కూడా తన ప్రత్యేకత చాటుకోవటం వల్ల నిర్మాతలు, హీరోలు శ్రీలీల కోసం క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో శ్రీలీల తీసుకున్న నిర్ణయం అందరిని షాక్ కి గురి చేస్తోంది. అదేంటంటే, గ్లామర్ పాత్రలకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందట శ్రీలీల.

పెళ్లి సందడి సినిమాలో గ్లామర్ షో చేసేందుకు నో చెప్పని శ్రీలీల, ఆ తర్వాత రవితేజ సరసన హీరోయిన్ గా నటించిన ధమాకా సినిమాలో గ్లామర్ షో చేయలేదు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో కూడా గ్లామర్ షో చేయనని కండీషన్ పెట్టినట్టు సమాచారం అందుతోంది. వరుసగా క్రేజీ ఆఫర్లు వస్తున్న తరుణంలో శ్రీలీల గ్లామర్ రోల్స్ దూరంగా ఉండటం అన్నది రిస్క్ తీసుకోవటమే అన్న కామెంట్స్ వినిపిస్తుంటే. మరో పక్క ఇంతటి క్రేజ్ ఉన్న సమయంలో, గ్లామర్ షో చేయకపోయినా కూడా ఆఫర్లు వస్తాయని ఫేడ్ అవుట్ అయ్యే పరిస్థితి వస్తే తప్ప గ్లామర్ ప్రధాన పత్రాలు చేయాల్సిన అవసరం లేదని కొందరు అంటున్నారు.

ఈ నేపథ్యంలో గ్లామర్ షో కి నో చెప్పిన శ్రీలీల కేవలం కమర్షియల్ సినిమా హీరోయిన్ పాత్రలే కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పత్రాలు ఎంచుకుంటూ పోతే టాలీవుడ్లో లాంగ్ స్పాన్ ఉన్న హీరోయిన్ గా కొనసాగే అవకాశం ఉంది. సాధారణంగా ఏ హీరోయిన్ అయినా కెరీర్ మొదట్లో గ్లామర్ షోకు దూరంగా ఉండి, ఆ తర్వాత బోల్డ్ క్యారెక్టర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటారు. అలాంటిది శ్రీలీల మొదటి సినిమాలో గ్లామర్ కి ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించి, ఇప్పుడు నో చెప్పటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి, ఈ కన్నడ భామ తీసుకున్న నిర్ణయం తన కెరీర్ ఫై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు