G.O.A.T: భారీగా రెమ్యూనరేషన్ పెంచిన సుడిగాలి సుదీర్ !

సుడిగాలి సుదీర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు ప్రేక్షకులకు సుడిగాలి సుదీర్ బాగా దగ్గరయ్యాడు. దీనికి కారణం జబర్దస్త్ షో. అయితే… సుడిగాలి సుదీర్ సినిమా వార్తల కంటే రష్మితో లవ్ ట్రాక్, జబర్దస్త్ కామెడీ ట్రాక్ లతోనే ఫేమస్ అయ్యాడు. సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడు, గాలోడు పంటి చిత్రాలతో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకున్న మనోడికి బుల్లితెర మించిన క్రేజ్ అయితే వెండి తెరలో రాలేదు.

ఇక గాలోడు సినిమా తర్వాత ‘G.O.A.T’ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సుడిగాలి సుదీర్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఆయన ఫ్యాన్స్ కూడా ఈ సినిమా సుధీర్ కు మంచి విజయాన్ని తెచ్చి పెడుతుందని ఆకాంక్షిస్తున్నారు. లక్కీ మీడియా, మహాతేజ క్రియేషన్స్ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుడిగాలి సుదీర్ హీరోగా నటిస్తోండగా దివ్యభారతి హీరోయిన్గా నటిస్తోంది.

చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ, బెక్కం వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ‘G.O.A.T – Greatest Of All Times’ చిత్రం మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. సుధీర్ హీరోగా చేస్తున్న సినిమాలకు రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్నారని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇప్పుడు ఒక్కో సినిమాకి రెండు కోట్ల రూపాయలకు తక్కువ డిమాండ్ చేయడం లేదట. ఇక ఆ రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు కూడా నిర్మాతలు రెడీగా ఉండటం విశేషం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు