Surya: ఫ్యామిలీ లో కలహాలు.. అందుకే ముంబై కి షిఫ్ట్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి అందరికి తెలిసిందే. ప్రతి సినిమాకి విభిన్నమైన కథాంశాన్ని ఎన్నుకుంటాడు. మిగతా హీరోల కంటే కొంత మేరకు ఎక్కువగానే సూర్య కష్టపడుతుంటాడు. సూర్య తండ్రైన శివకుమార్, ఒక ఫేమస్ ఆక్టర్. తండ్రికి అంత పేరున్న తన స్వయం కృషితో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం దక్కించుకున్నాడు సూర్య.

2006 లో జ్యోతిక ని పెళ్లి చేసుకున్నాడు సూర్య. అప్పుడు సూర్య ఇంట్లో వాళ్ళు పెళ్ళికి వ్యతిరేకంగా ఉన్నా, చాలా గొడవ పడ్డాడని, రహస్యంగా జ్యోతిక ని పెళ్లి చేస్కుని, సెపరేట్ గా నివాసం ఉన్నారని కూడా పుకార్లు వచ్చాయి. అయితే కొద్ది కాలం తర్వాత ఇంట్లో వాళ్ళు వారి రిలేషన్ కి ఒప్పుకున్నారని తెలిసింది.

అయితే ఇన్ని సంవత్సరాల నుండి కలిసి ఆనందంగా ఉంటున్న వారి కుటుంబంలో, ఇప్పుడు గొడవలు వచ్చాయని, జ్యోతిక కి సూర్య ఫ్యామిలీ కి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని, ఆ గొడవలు రోజు రోజుకి పెరుగుతున్నాయి గాని తగ్గట్లేదని, అవి ఇంకా చెయ్యి దాటుతున్నాయని పుకార్లు వస్తున్నాయి.

- Advertisement -

అయితే సూర్య ఇంక వీటిని తట్టుకోలేక ఇటీవల ముంబై లో ఒక కొత్త అపార్ట్మెంట్ కొన్నట్లు తెలుస్తుంది. అది మొత్తం 9000 స్క్వేర్ ఫీట్స్ ఉందని, అది టాప్ బాలీవుడ్ నటీ నటులు మరియు రాజకీయ నాయకులు వుండే ప్లేస్ అని, అది కొనడానికి అయిన మొత్తం ఖర్చు 68 కోట్లు అయ్యిందని సమాచారం అందింది. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలీదు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు