Kamal Haasan : కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీలో సూర్య..!

కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘రాజ్ కమల్ ఫిలిమ్స్’ బ్యానర్ పై కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కమల్ హాసన్ తో పాటు ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ వంటి మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా నటిస్తున్నారు. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కమల్ హాసన్ ఈ మధ్య కాలంలో సరైన హిట్ అందుకుంది లేదు. ఈ చిత్రంతో ఆయన మంచి హిట్ అందుకుంటారు అని అంతా అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో మరో స్టార్ హీరో కూడా చిన్న అతిథి పాత్ర పోషించాడు అనేది తాజా సమాచారం. ఆ స్టార్ హీరో మరెవరో కాదు సూర్య.

అవును విక్రమ్ లో సూర్య ఓ చిన్న అతిధి పాత్రలో మెరిసినట్టు ఇటీవల ఓ సందర్భంలో అతని సన్నిహితుల వద్ద ప్రస్తావించాడట. మే 15 న జరుగబోతున్న విక్రమ్ మ్యూజికల్ ఈవెంట్ కు కూడా సూర్య హాజరుకాబోతున్నాడట. అయితే చిత్ర బృందం మాత్రం ఈ విషయం పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇలాంటి గెస్ట్ రోల్స్ సూర్య గతంలో చాలా చేశాడు. అలాంటి గొప్ప నటుడు ఇందులో భాగం అయితే ఈ చిత్రం పై ఉన్న అంచనాలు తారా స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు