Suriya : సీక్వెల్ త్వరలోనే ?

త‌మిళ స్టార్ సూర్య ని మాస్ హీరోగా నిల‌బెట్టిన సినిమా సింగం. దాదాపు 12 ఏళ్ల కింద‌ట వ‌చ్చిన సింగం మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. దీనికి సీక్వెల్‌గా వ‌చ్చిన రెండు సినిమాలు కూడా హిట్ టాక్‌నే సొంతం చేసుకుని క‌లెక్ష‌న్ల‌ను వ‌సూళ్లు చేశాయి. ఈ నేప‌థ్యంలోనే సింగం 4 ని కూడా తెర‌పైకి తీసుకొచ్చేందుకు ద‌ర్శ‌కుడు హ‌రి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. ఇటీవ‌ల ప్ర‌యోగాల‌కు పెద్ద‌పీట వేస్తున్న సూర్య‌కి కూడా ఇప్పుడు మాస్ ఆడియ‌న్స్ ని మెప్పించే మంచి హిట్ ఒకటి అవ‌స‌రముంది.

2010లో హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో  తెరకెక్కిన ‘సింగం’ సినిమా త‌మిళంతో పాటు తెలుగులో కూడా సంచ‌ల‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అందులో సూర్య పోలీస్ ఆఫీస‌ర్‌గా అద్బుత‌మైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల నుంచి మంచి మార్కులే సంపాదించాడు. దీంతో దానికి సీక్వెల్ గా 2013లో ‘సింగం 2’ విడుద‌ల చేశాడు. ఈ సినిమా కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. ఆ త‌రువాత 2017లో సింగం 3 సినిమా విడుద‌ల చేశారు. తొలి రెండు సినిమాల‌తో పోల్చితే  మిక్స్ డ్ టాక్ ని సొంతం చేసుకుని  ‘సింగం 3’ క‌లెక్ష‌న్ల‌ను కాస్త త‌క్కువగానే వ‌సూలు చేసింది.

దీంతో సింగం సిరీస్ ముగిసిపోయింద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ తాజాగా ద‌ర్శ‌కుడు హ‌రి క‌థ‌ను సిద్ధంగా చేశాడ‌ట‌. ఓవైపు సూర్య‌, మ‌రోవైపు హ‌రి వేర్వేరు చిత్రాల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల్ల ఈ సినిమాను తెర‌కెక్కించ‌డం లేద‌ట‌. వీరి సినిమాలు పూర్తి కాగానే ‘సింగం 4’ వ‌ర్క్ ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది. సూర్య ఇటీవ‌ల న‌టించిన ‘ఈటీ’ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది. త‌మిళంలో కాస్త ప‌ర్వాలేద‌నిపించిన ‘ఈటీ’ తెలుగులో మాత్రం అంత‌గా క‌నెక్ట్ కాలేదు. ప్ర‌స్తుతం సూర్య దర్శకులు బాల‌, సిరుతై శివ సినిమాల‌లో న‌టిస్తున్నారు. మ‌రోవైపు ద‌ర్శ‌కుడు హ‌రి చేతిలో కూడా రెండు ప్రాజెక్టులు ఉన్న‌ట్టు స‌మాచారం. ఈ రెండు ప్రాజెక్టులు పూర్త‌యిన త‌రువాత ‘సింగం 4’ ప‌ట్టాలెక్కే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇక ఏం జరుగుతుందనేది కొద్ది రోజుల పాటు వేచి చూడాలి.

- Advertisement -

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు