Tamannaah : మరో ఐటెం సాంగ్ లో..

సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రాజెక్టు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా వస్తుంది. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను కూడా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

పూజ హెగ్డే తో పాటు ప్రియాంక అరుల్ మోహన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో తమన్నా స్పెషల్ సాంగ్ చేయనుందట.

ఇందుకు ఈ ముద్దుగుమ్మ భారీగానే డిమాండ్ చేస్తుందట. ఈ పాట కోసం ఏకంగా రూ. 4 కోట్లు పారితోషికంగా తీసుకుంటుందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ వార్తలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే దీనిపై త్వరలోనే ప్రకటన రానుందని టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు